నేతలతో జగన్ కీలక భేటీ... రోజా ఆల్ మోస్ట్ క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-13 05:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగింది. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి, ఆర్కే రోజా పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా ఆమె వైసీపీని వీడుతున్నారని.. తమిళనాడు వెళ్లి దళపతి విజయ్ కొత్తగా నెలకొల్పిన పార్టీలో జాయిన్ అవ్వబోతునారని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఈ కథనాలు, ప్రచారాలపై చాలా కాలం రోజా స్పందించలేదు. ఇటీవల వైఎస్ జగన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడం, తర్వాత తిరుపతిలో క్లారిటీ ఇవ్వడం తెలిసిందే.

పైగా... కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను వైసీపీ శ్రేణులు తిరస్కరిస్తారంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఈ సమయంలో గత కొన్ని రోజులుగా రోజా కూడా యాక్టివ్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా తిరుపతి జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

అవును... తిరుపతి జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆమె తన అభిప్రాయాలు జగన్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా పార్టీలోని ఇతర నేతల మధ్య ఉన్న విభేదాలు, ఐకమత్య లోపాలపైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో వారందరికీ జగన్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను రోజా ఎక్స్ లో పంచుకున్నారు. ఇదే సమయంలో జగన్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

దీంతో... తన భవిష్యత్ రాజకీయాలపై రోజా పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో... ఇకపై విభేదాలు పక్కనపెట్టి తిరుపతి జిల్లా నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చినట్లేనని అంటున్నారు. దీంతో... గతంలో లాగానే ఇకపై రోజా ఫుల్ యాక్టివ్ గా మారబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News