జమిలి బిల్లు... ఈ ఫిగర్సే కీలకం!

ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న కీలక అంశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు ఒకటనే సంగతి తెలిసిందే.

Update: 2024-12-17 04:17 GMT

ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న కీలక అంశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు ఒకటనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీ ఒక్కో అడుగు ముందుకు వేస్తుకుంటూ పోతుందనే చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించగా.. అది నేడు లోక్ సభకు రానుంది.

ఇప్పటికే లోక్ సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్ వాల్ సభలో ప్రవేశపెడతారు. అనంతరం.. ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్ కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో.. సభలో పార్టీల బలాబలాలను బట్టి ఈ సంఘంలో సభ్యులను నియమిస్తారు. ఈ క్రమంలో.. భారతీయ జనతాపార్టీ అతి పెద్ద పార్టీ కావడంతో దానికే ఛైర్మన్ పదవి దక్కనుంది. ఇదే సమాంలో ఈ రోజే ఈ స్థాయీ సంఘంలోని సభ్యుల నియామంకాన్ని స్పీకర్ చేపడతారు. దీని పదవీ కాలాన్ని తొలుత 90 రోజులుగా నిర్ణయిస్తారు.

ఒక వేళ ఈ సంఘంలో పార్టీలు పేర్లను సూచించనిపక్షంలో.. సభ్యత్వాన్ని కోల్పోతారు. అప్పుడు బీజేపీ తన మిత్ర పక్షాలతో వార్ వన్ సైడ్ గా ముందుకు దూసుకుపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో... లోక్ సభలో పార్టీల బలాబలాలు సహజంగానే కీలక భూమిక పోషించబోతున్నాయి. ఈ సమయంలో... తటస్థ పార్టీల ప్రభావం పెద్దగా ఉండదని చెబుతున్నారు.

అవును... జమిలి ఎన్నికల బిల్లు నేపథ్యంలో సభలో పార్టీల బలాబలాలు కీలక భూమిక పోషించనున్న నేపథ్యంలో... కూటమి అభిప్రాయాలకు వాటిలోని పార్టీలు కట్టుబడతాయా.. లేక, ఈ విషయంలో వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలను ప్రతిభింబిస్తూ నిర్ణయం తీసుకుంటాయా అనే చర్చకు దాదాపు అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు.

ఈ సందర్భంగా ఆయా పార్టీల బలాబలాలను పరిశీలిస్తే... మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్ సభలో ఎన్డీఏ కు 293 సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా భారతీయ జనతాపార్టీకి 240 సీట్లు ఉండగా.. ఆ తర్వాత స్థానంలో తెలుగుదేశం పార్టీ 16 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. ఇక.. జనతాదల్ (యునైటెడ్) 12, శివసేన 7, లోక్ జనశక్తి పార్టీ 5 సీట్లతో పెద్ద పార్టీలుగా ఉన్నాయి.

ఇక ఇండియా కూటమి విషయానికొస్తే... ఈ కూటమికి లోక్ సభలో 249 సీట్ల బలం ఉండగా.. వీటిలో కాంగ్రెస్ 99, ఎస్పీ 37, టీఎంసీ 28, డీఎంకే 22 సీట్లతో పెద్ద పార్టీలుగా ఉన్నాయి. ఇదే సమయంలో తటస్థ పార్టీల వద్ద 11 సీట్లు ఉన్నాయి. దీంతో... ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ బిల్లును పాస్ చేయించుకోవడం ఎన్డీయే కూటమికి ఆల్ మోస్ట్ అసాధ్యం కాదనే అంటున్నారు!

Tags:    

Similar News