చెత్తబుట్ట లేని దేశం... ఉగ్రవాద దాడే అందుకు కారణం!
దేశంలో పరిశుభ్రత చాలా ముఖ్యమని భారత్ వంటి దేశాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.;

దేశంలో పరిశుభ్రత చాలా ముఖ్యమని భారత్ వంటి దేశాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. పరిశరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే దేశం అంత అందంగా కనిపిస్తోందని, ప్రజలు అంత ఆరోగ్యంగా ఉంటారని, ఈ స్వచ్ఛత దేశ ప్రజల క్రమశిక్షణకు, సామాజిక బాధ్యతకు అద్ధం పడుతుందని అంటుంటారు. అసలు చెత్తబుట్టే లేని దేశం ఉందని తెలుసా?
అవును... బహిరంగ ప్రదేశాల్లో డస్ట్ బిన్ లు లేని దేశం ఒకటుంది! ఆ దేశంలో ఈ స్థాయి మార్పుకు కారణమైంది ఓ ఉగ్రవాద దాడి అని చెబుతున్నారు. మీరు ఆ దేశం వెళ్తే.. బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా చెత్తబుట్ట కనిపించదు.. అది చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. ఏమిటాదేశం, ఏమిటా ఉగ్రదాడి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందా..!
జపాన్ దేశంలో బహిరంగ ప్రదేశాలలో ఎక్కడా చెత్తబుట్టలు కనిపించవు. ఈ విషయం కొత్తగా అక్కడకు వెళ్లినవారికి ఆశ్చర్యంగా అనిపిస్తాయని అంటారు. ఆ దేశంలో ప్రతీచోటా హైటెక్ టెక్నాలజీ, అప్ డేటెడ్ సౌకర్యాలు ఉంటాయి కానీ.. చెత్తబుట్టలు మాత్రం కనిపించవు. ఎందుకంటే.. ఇక్కది ప్రజలు తమ చెత్తను వారే జాగ్రత్తపరుచుకుంటారు.
జపాన్ లోని ప్రసిద్ధ దుకాణాలలో కూడా ఈ డస్ట్ బిన్స్ కనిపించవని అంటారు. ప్రజలు తాగేసిన కాఫీ కప్పులను తిరిగి షాపులోనే ఇస్తారు తప్ప బయట పడేయరట! వీరీ బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని అంటారు. స్కూల్స్ లోనే పిల్లలకు తమ తమ ప్రదేశాలను శుభ్రం చేసుకోవడం నేర్పుతారు.
ఉదాహరణకు... 2022 ఖతార్ ప్రపంచ కప్ సందర్భంగా జపాన్ ఫుట్ బాల్ అభిమానులు జర్మనీపై విజయోత్సవాన్ని స్వయంగా స్టేడియంలను శుభ్రం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానికి కారణం... శుభ్రత, పరిశుభ్రత అనేది జపాన్ సంస్కృతిలో ఒక భాగం అని చెబుతుంటారు.
టోక్యో మెట్రో దాడి తర్వాత భారీ మార్పు!:
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం... జపాన్ దేశంలో బహిరంగ ప్రదేశాలలో చెత్తబుట్టలు లేకపోవడానికి అతిపెద్ద కారణం 1995 మార్చి 20న జరిగినట్లు చెబుతారు. ఇందులో భాగంగా... నాడు జరిగిన టోక్యో మెట్రో సారిన్ గ్యాస్ దాడి అని అంటారు. ఓ మతపరమైన ఆరాధనకు చెందిన సభ్యులు ప్లాస్టిక్ సంచులలో విషపూరితమైన సరిన్ గ్యాస్ నింపి మెట్రో రైళ్లలో వదిలారు!
దీనివల్ల 12 మంది మరణించగా.. వేలాది మందిపై ఇది ప్రభావం చూపించిందని అంటారు. ఇది జపాన్ కు పెద్ద చేదు జ్ఞాపకంగా మిగిలిందని అంటారు. ఈ దాడి తర్వాత.. భవిష్యత్తులో అలాంటి దాడి జరిగే అవకాశాన్ని తొలగించడానికి జపాన్ ప్రజా చెత్తబుట్టలను తొలగించాలని నిర్ణయించుకుందని చెబుతారు.
నాటి నుంచి.. అంటే... సుమారు 30 సంవత్సరాలుగా జపాన్ లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తబుట్టలు ఉండకూడదనే నియమం అమలులో ఉంది. అయితే.. అక్కడక్కడా ట్రాష్ క్యాన్స్ కనిపిస్తాయి.. అవి సీల్డ్ చేయబడి, చిన్న స్పేస్ చెత్తవేయడానికి ఓపెన్ చేసి ఉంటాయి! అందుకే.. పరిశుభ్రత విషయంలో జపాన్ ను ప్రపంచంలోని చాలా దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని అంటారు.