అగ్ర‌రాజ్యంలోనూ ఉచితాలు.. బైడెన్ వ‌రాలు!

అయితే.. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు, ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న జో బైడెన్ ఉచితాల వైపు మొగ్గు చూపారు.

Update: 2024-03-09 04:21 GMT

ఎన్నిక‌ల‌కు ముందు భార‌త్ వంటి దేశాల్లో ఉచిత కానుక‌లు, ప‌థ‌కాలు.. స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి. తాము గెలిస్తే.. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పే పార్టీలు కోకొల్ల‌లుగా ఉన్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అగ్ర‌రాజ్యం అమెరికాలో ఇలాంటి సంస్కృతి లేదు. అయితే.. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు, ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న జో బైడెన్ ఉచితాల వైపు మొగ్గు చూపారు. అయితే.. ఇది నేరుగా ఇస్తున్న డీబీటీ ప‌థ‌కం కాదు. కానీ, దాదాపు అలాంటిదే.

విష‌యం ఏంటంటే.. అమెరికాలో కొత్త‌గా ఇళ్లు కొనాల‌న్నా.. ఇప్ప‌టికే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని కొనుగోలు చేసిన వాటిని వివిధ కార‌ణాల‌తో విక్ర‌యించాల‌న్నా.. ట్యాక్సులు త‌డిసి మోపెడు అవుతున్నాయి. దీంతో రియ‌ల్ ఎస్టేట్ రంగం గ‌త ఆరు మాసాలుగా ఒడిదుడుకుల్లో ఉంది. పైగా ముందుకు సాగ‌డం లేదు. దీంతో వ్యాపార లావాదేవీలు దాదాపు స్తంభించాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని అధ్య‌క్షుడు బైడెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

కొత్త‌గా తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి 10 వేల డాల‌ర్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా బ్యాంకు రుణాల‌తో అప్పులు చేసి ఇల్లు కొన్న‌వారు తిరిగి విక్ర‌యించాల‌ని అనుకుంటే వారికి కూడా 10 వేల డాట‌ర్ల మేర‌కు ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఫ‌లితంగా రియ‌ల్ ఎస్టేట్ రంగంలో నెల‌కొన్న స్త‌బ్ద‌త తొలిగిపోతుంద‌ని ఆయ‌న ఆశిస్తున్నారు.

ఇలా పంపకం

తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి 10 వేల డాల‌ర్ల‌ను రెండేళ్ల‌లో 5000 డాల‌ర్ల చొప్పున ఇస్తారు. అదేవిధంగా ఇల్లు విక్ర‌యించే వారికి 10 వేల డాల‌ర్ల‌ను ఒకే విడుత‌లో అందించ‌నున్నారు. దీనిని సెనేట్‌లో ఆయ‌న ప్ర‌క‌టించారు. క‌రోనా స‌మ‌యంలో 2.65 శాతం వ‌డ్డీ రేటుకే 30 ఏళ్ల నిర్ణీత గ‌డువు మేర‌కు ఇళ్లు కొనుగోలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. అయితే.. తాజాగా ఈ వ‌డ్డీ రేట్లు 6.88 శాతానికి పెరిగిపోయాయి. దీంతో వారు ఈ వ‌డ్డీని భ‌రించ‌లేక పోతున్నారు. దీంతో బైడెన్ నిర్ణ‌యం సంచ‌ల‌నం గా మారింది. ఇక‌, కొత్త‌గా ఇల్లు కొనుగోలు చేసేవారికి 25 వేల డాల‌ర్ల డౌన్ పేమెట్ హామీ కూడా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

Tags:    

Similar News