కొడాలి ఊచకోత... చంద్రబాబు పవన్ లపై సెటైర్ల వర్షం!
ఇందులో భాగంగా ప్రధానంగా టీడీపీ ఎవరితో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుంది అనే అంశం ఇప్పటికీ సందిగ్దంగా ఉందటంతో వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా టీడీపీ ఎవరితో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుంది అనే అంశం ఇప్పటికీ సందిగ్దంగా ఉందటంతో వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అవును... ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు వైఎస్ జగన్ పై ఒంటరిగా పోటీచేయలేక అటు దత్తపుత్రుడు, ఇటు ఉత్తపుత్రుడితో పాటు బీజేపీ నుంచి వదినమ్మ, కాంగ్రెస్ నుంచి కొత్తగా వచ్చిన చెల్లెమ్మలతో సిద్ధపడుతున్నాడని సెటైర్లు వేశారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్దలను బుట్టలో వేయాలని చంద్రబాబు ప్రయత్నించాడని అన్నారు.
ఇందులో భాగంగా చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారని.. అయితే గతంలో ఉన్నట్లుగా ఎల్.కే. అద్వానీ, వాయిపేయి లాంటి అమాయకులు కాదు ఇప్పుడు అక్కడ ఉన్నది.. అమిత్ షా, మోడీ లాంటి నేతలని.. వారి వద్ద బాబు ఆటలు సాగినట్లు లేవని అన్నారు. ఇదే సమయంలో... ఏపీలో తమకు 150 అసెంబ్లీ, 20 లోక్ సభ ఇచ్చి.. టీడీపీని 25 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని షా సూచించినట్లు ఉన్నారని కొడాలి ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లి వచ్చి వారం దాటినా హైదరాబాద్ వదిలి రాలేకపోతున్నాడని.. మోడీషా ధ్వయం దెబ్బకు చంద్రబాబు మంచం ఎక్కినట్లున్నారని కొడాలి సెటైర్లు వేశారు. ఇదే సమయంలో భీమవరంలోని పవన్ కల్యాణ్ జనసేన యాత్ర వాయిదా పడటంపైనా కొడాలి స్పందించారు. హెలీకాప్టర్ ల్యాండింగ్ కి అనుమతి దక్కకపోవడానికి గల కారణాలను వివరించారు.
ఇందులో భాగంగా భీమవరంలోని ఒక కాలేజీ ప్రాంగణలో హెలీకాప్టర్ ల్యాండింగ్ కి అనుమతి అడిగారని.. అయితే కాలేజీ బిల్డింగుల మధ్యన కుదరదని ఆర్ & బీ అధికారులు అనుమతి నిరాకరించారని చెప్పిన కొడాలి నాని... విజయవాడ నుంచి భీమవరం వెళ్లడానికి హెలీకాప్టర్ కావాలా అని ప్రశ్నించారు! ఒక వేళ అనుమతి దొరకకపోతే మీటింగ్ మానేయడమేమిటని అడిగారు. ఈ విషయాలను భీమవరం ప్రజలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు!