పవన్ని గట్టిగా టార్గెట్ చేయబోతున్న కేసీయార్...?
బీయారెస్ చేసిన మంచిని వివరిస్తూనే విపక్షాల తీరుని ఎండగడుతున్నారు.
తెలంగాణా ఎన్నికల ప్రచారం వాడిగా వేడిగా సాగుతోంది. అధికార బీయారే అయితే ఎక్కడా తగ్గడంలేదు. బీయారెస్ అగ్ర నేతలు కేసీయార్ కేటీయార్ హరీష్ రావు రోజుకూ తలో మూడు నాలుగు మీటింగ్స్ ని అడ్రస్ చేస్తున్నారు. బీయారెస్ చేసిన మంచిని వివరిస్తూనే విపక్షాల తీరుని ఎండగడుతున్నారు.
కేసీయార్ కేటీయార్ హరీష్ రావు ఒక్క పద్ధతి ప్రకారమే ప్రచారం చేస్తున్నారు. కేటీయార్ టీడీపీని చంద్రబాబుని కీర్తిస్తూ మాట్లాడుతున్నారు. అదే టైం లో సాఫ్ట్ నేచర్ తో స్పీచ్ ఇస్తున్నారు. ఆయన కేసీయార్ ని హైలెట్ చేస్తూ వెళ్తున్నారు.
ఇక హరీష్ రావు చూస్తే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు. ఒక విధంగా చీల్చిచెండాడుతున్నారు అని చెప్పాలి. కేసీయార్ విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ నేతల పేరు ఎత్తకుండా విమర్శలు చేస్తున్నారు. అదే టైం లో ఆయన తెలంగాణా సెంటిమెంట్ ని రగిలించే ప్రయత్నం ఈసారి కూడా చేస్తున్నారు.
ఎందుకంటే ఈ కార్డ్ బీయారెస్ కి అద్భుతమైన ఆయుధంగా ఉంది. గతంలో అంటే 2018 ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణా ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగారు. దాంతో డైరెక్ట్ గా చంద్రబాబుని కేసీయార్ టార్గెట్ చేసి బంపర్ విక్టరీ కొట్టేసారు.
ఈసారి టీడీపీ రేసులో లేదు. దాంతో చంద్రబాబుని ఏమీ అనలేని పరిస్థితి. మరో వైపు కేటీయార్ చంద్రబాబుని టీడీపీకి కొనియాడుతున్నారు. ఇక కేసీయార్ అయితే ఆంధ్రా వాళ్ళు వస్తున్నారు అంటూ అపుడే స్టార్ట్ చేశారు. నర్సంపేటలో ఆయన ఏకంగా వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మీదనే విమర్శణా బాణాలు వేశారు.
నర్సంపేట బీయారెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆంధ్రోళ్ళ పెత్తనం మీద పోరాడుతూంటే షర్మిల ఆయన మీద పగబట్టి డబ్బు మూటలతో ఓడించాలని టార్గెట్ గా పెట్టుకున్నారని సంచలన కామెంట్స్ చేశారు. నిజానికి షర్మిల పార్టీ అయితే పోటీ చేయడంలేదు. ఆమె ఓపెన్ గా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు.
ఆమె ప్రభావం ఉంది అనడానికి ఆమె ఎన్నికల ప్రచారం కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా చేయడంలేదు. కానీ చిత్రంగా ఆమెను కేసీయార్ టార్గెట్ చేశారు. ఇపుడు కేసీయార్ చూపు పవన్ కళ్యాణ్ మీద ఉంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఆయన కేవలం ఎనిమిది సీట్లలోనే పోటీ పడుతున్నారు. అయితే ఇది కూడా కేసీయార్ కి ఒక అవకాశమే అంటున్నారు. అంధ్రాకు చెందిన పవన్ తెలంగాణా ఎన్నికల ప్రచారంలో దిగితే మాత్రం కేసీయార్ డైరెక్ట్ గా పవన్ మీద కామెంట్స్ చేయడానికి వెనుకాడరని అంటున్నారు. అంతే కాదు ఆంధ్రా వాళ్ళు తెలంగాణాలో పెత్తనం అంటూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు
మరో వైపు చూస్తే ఏపీలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో అధికారికంగా ఉన్నారు. దాంతో ఆయన మీద మరింత దూకుడు చేయడమే కాదు చంద్రబాబుని కూడా మధ్యలోకి లాగే ప్రయత్నం కూడా చేస్తారని అంటున్నారు. ఇదంతా పవన్ ఎన్నికల ప్రచారంలోకి దిగినపుడు అని అంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఎన్నికల ప్రచారానికే రాలేదు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో తెలియడంలేదు. ఆయన కనుక ప్రచారం చేపడితే మాత్రం అది కచ్చితంగా ఎంతో కొంత బీయారెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది అని అంటున్నారు. మరి పవన్ ని గట్టిగా టార్గెట్ చేయాలని కేసీయార్ సహా బీయారెస్ పెద్దలు ఎదురు చూస్తున్నారు. పవన్ వారికి ఆ చాన్స్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
అంతే కాదు తెలనగణాలో ఈసారి సెంటిమెంట్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. మరో రెండు వారాలు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. ఈలోగా ప్రజల నిర్ణయం ఆలోచనలు మారుతాయా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.