బాబ్బాబు.. ఆ 'విషయాలు' రాయకండి: తమ్ముళ్లు వినతులు..!
అచ్చంగా టీడీపీని భు జాల మోస్తున్న ప్రధాన పత్రికలు జిల్లాల పేజీల్లో పుంఖాను పుంఖాలుగా రాస్తున్న వాస్తవాలు.
దందా.. ఇప్పుడు ఎక్కడ ఏనలుగురు గుమిగూడినా వినిపిస్తున్న మాట. ఇసుక నుంచి మద్యం వరకు, బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు.. ఏది కావాలన్నా.. దందానే. ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఇది ఎవరో వైసీపీ నాయకులు, టీడీపీ అంటే తిట్టిపోసేవారు.. చెబుతున్న మాట కాదు. అచ్చంగా టీడీపీని భు జాల మోస్తున్న ప్రధాన పత్రికలు జిల్లాల పేజీల్లో పుంఖాను పుంఖాలుగా రాస్తున్న వాస్తవాలు. అంతేకాదు.. ఇలా రాస్తున్న వారు ఆధారాలు కూడా బట్టబయలు చేస్తున్నారు.
నిజానికి ఇలాంటి వార్తలు వస్తే.. టీడీపీ నాయకులు విరుచుకుపడతారు. నోటికి పనిచెబుతారు. జగన్‌పై నిప్పులు చెరుగుతారు. కానీ, వారిని మోసేపత్రికలు, మీడియాలే చెబుతుంటే.. ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు కొత్త నాయకులు.. మీడియా బృందాలను వేడుకుంటు న్నారు. బాబ్బాబు ఆ విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి! అని విన్నవించుకుంటున్నారు. మరికొందరుముదురు నాయకులు మాత్రం రాసుకో! నీ ఇష్టం వచ్చింది రాసుకో!! అని చెప్పేస్తున్నారు.
దీంతో ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాలోనే తీవ్రస్థాయిలో కథనాలు వస్తున్నాయి. ఇసుక నుంచి మద్యం వరకు జరుగుతున్న దందాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. అసలు ఏం చేస్తున్నారనే కోణంలోనూ కథనాలు వండేస్తున్నారు. అయితే.. ఎక్కడా చంద్రబాబు కానీ, నారా లోకష్‌కు కానీ.. మరకలు అంటకుండా జాగ్రత్తలు పడుతున్నారు. మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. అయితే.. దీనికి ముందే.. తమ్ముళ్లు వాటాలు వేసుకున్నారు. ఏరోజుకారోజు ముడుపుల కోసం బేరాలు కుదిరిపోయాయి.
ఇక, ఇసుకలో మరిన్న మస్కా వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. రీచ్‌లలో పాగా వేసేందుకు తమ్ముళ్లు దొడ్డిదారులు వెతుకుతున్నారు. ఏదో ఒకరకంగా రీచ్‌లో పాగా వేస్తే.. తర్వాత పెత్తనం చేయొచ్చన్నది తమ్ముళ్ల సీక్రెట్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాజధాని జిల్లాల్లో అయితే.. ఈ వేగం దూకుడు ఎక్కువగా ఉంది. సో.. ఇప్పుడు వేరే వారు విమర్శలు చేస్తే.. తప్పని ఎవరైనా అనుకోవచ్చు. కానీ, అనుకూల మీడియానే అల్లరి చేస్తూ.. నిజాలు బయటకు తెస్తే.. ఏం చేయాలన్నది సర్కారుకు పాలుపోని ప్రశ్న. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.