ప్రపంచ సూపర్ బిలియనీర్ల జాబితాలో మనోళ్లు ఎందరంటే?

కనీసం ఈ మొత్తం ఉన్న సూపర్ బిలియనీర్లు ఎంత మంది ఉన్నారు? వారి వివరాలకు సంబంధించి అభివర్ణించింది.;

Update: 2025-02-28 18:30 GMT

దగ్గర దగ్గర రూ.4.54 లక్షల కోట్లు. జాగ్రత్తగా చదవండి. ఇంత భారీ ఆస్తులు ఎవరి దగ్గర ఉంటాయి? అనుకుంటున్నారా? అలాంటోళ్లు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. కనీసం ఈ మొత్తం ఉన్న సూపర్ బిలియనీర్లు ఎంత మంది ఉన్నారు? వారి వివరాలకు సంబంధించి అభివర్ణించింది.

అలాంటి వారు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 24 మంది ఉన్నట్లు లెక్కి తేల్చింది. ఇక్కడో మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఈ 24 మంది సూపర్ బిలియనీర్లలో 16 మంది సెంటి బిలియనీర్లుగా పేర్కొంది. అంటే.. వీరు వంద బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉండాలి. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.8.7లక్షల కోట్లు ఆస్తి. ఈ పదహారు మంది సంపద విలువ కలిపితే మొత్తం 3.3 లక్షల కోట్ల డాలర్లుగా తేల్చారు.

ఇది ధనిక దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ జీడీపీకి సమానం కావటం గమనార్హం. ఇక.. ఈ జాబితాలో మన దేశానికి సంబంధించిన ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలకు చోటు దక్కింది. అందులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కాగా రెండో వారు గౌతమ్ అదానీ. ముకేశ్ అంబానీ సంపదను 90.6 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. గౌతమ్ అదానీ సంపదను 60.6 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు.

ఈ జాబితాలో 419 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ టాప్ లో నిలిచారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 262.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో.. బెర్నార్డ్ అర్నాల్ట్ 238.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టాప్ 10లో ఉన్న వారిని చూస్తే..

ర్యాంక్ పేరు సంపద (బిలియన్ డాలర్లు)

04 లారీ ఎలిసన్ 237

05 జుకర్ బర్గ్ 220

06 సెర్గీ బ్రిన్ 160

07 స్టీవ్ బామర్ 157

08 వారెన్ బఫెట్ 154

09 జేమ్స్ వాల్టన్ 117

10 శామ్యూల్ రాబ్ సన్ వాల్టన్ 114

Tags:    

Similar News