అయిదింట నాలుగు కాంగ్రెస్ గెలిస్తే ...దెబ్బ పడేది బీజేపీకి....?

దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు పూర్తి అయ్యాయి. రెండు విడతలుగా చత్తీస్ ఘడ్, ఒక విడతలో మిజోరాం, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరిగాయి

Update: 2023-11-19 03:50 GMT

దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు పూర్తి అయ్యాయి. రెండు విడతలుగా చత్తీస్ ఘడ్, ఒక విడతలో మిజోరాం, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. ఇక ఈ నెల 25న రాజస్థాన్ ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 30న తెలంగాణా ఎన్నికలతో మొత్తం అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సమరం ముగుస్తుంది.

ఇదిలా ఉంటే మిజోరాం లో ఈసారి కాంగ్రెస్ వస్తుంది అని అంటున్నారు. చత్తీస్ ఘడ్ లో రెండవసారి కాంగ్రెస్ కే చాన్స్ అని కూడా సర్వేలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండింటి మధ్య హోరా హోరీ పోరుతో ఉంది. ఎవరు గెలిచినా అతి తక్కువ నంబర్ తోనే అని అంటున్నారు.

రాజస్థాన్ చూస్తే బీజేపీకి పూర్తి స్థాయిలో మొగ్గు ఉంది. తెలంగాణాలో బీజేపీకి హోప్స్ తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. బీయారెస్ తో కాంగ్రెస్ పోటీ పడుతోంది. ఇలా ఉన్న రాజకీయ దృశ్యంలో జాతీయ స్థాయిలో ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నదే చర్చగా ఉంది.

డిసెంబర్ 3న ఫలితాలు వస్తున్నాయి. బీజేపీకి రాజస్థాన్ మాత్రమే దక్కి మిజోరాం, మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్ తెలంగాణా కాంగ్రెస్ గెలుచుకుంటే దేశ రాజకీయ ముఖ చిత్రమే టోటల్ గా మారుతుంది అని అంటున్నారు. ఎందుకంటే సౌతిండియాలోనూ నార్త్ లోనూ ఒకేసారి కాంగ్రెస్ తన ప్రాభవాన్ని చాటుకున్నట్లుగా అవుతుంది.

అదే టైం లో కాంగ్రెస్ కి లోక్ సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు బాగా పెరుగుతాయని కూడా భావిస్తున్నారు. ఇక బీజేపీ రాజస్థాన్ మాత్రమే గెలిస్తే మాత్రం ఆ ప్రభావం మోడీ మీద ఎండీయే మీద కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నారు. మోడీ కాలికి బలపం కట్టుకుని అయిదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

కొద్ది నెలల క్రితం చూస్తే మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయం ఖాయం అనుకున్నారు. తెలంగాణాలో మంచి నంబర్ లో స్కోర్ సాధిస్తుంది అని లెక్క కట్టారు. కానీ ఇపుడు వాతావరణం మారింది. దాంతో అయిదింట నాలుగు స్టేట్స్ ని కనుక కాంగ్రెస్ గెలిస్తే మాత్రం బీజేపీని ఢీ కొట్టే స్థాయిలో కాంగ్రెస్ నిలబడుతుంది అని అంటున్నారు.

అదే విధంగా బీజేపీని ఓడించి మేమే కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పగలుస్తుంది అని అంటున్నారు. ఇండియా కూటమిని విపక్షాలతో ఇప్పటికే ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ కూటమిలో పూర్తిగా పెద్దన్న పాత్రను పోషిస్తుంది అని కూడా అంటున్నారు.

ఇక సౌతిండియాలో ఉన్న తెలంగాణా కర్నాటక కాంగ్రెస్ చేతిలో ఉంటే తమిళనాడు మిత్రపక్షం డీఎంకే తో కలసి 39 ఎంపీ సీట్లను తన ఖాతలో ఉంచుకుంటుంది. కేరళలో వామపక్షాలు గెలిచినా ఇండియా కూటమిలోనే ఉంటాయి. ఏపీలో కూడా పొత్తుల ద్వారా కొత్త పార్టీలను ఇండియా కూటమిలోకి ఆహ్వానించి తన స్థానం పటిష్టం చేసుకునే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయని అంటున్నారు. సో ఈ అయిదు రాష్ట్రాల ఫలితాలు మాత్రం దేశ రాజకీయాలాను మలుపు తిప్పే సెమీ ఫైనల్స్ గానే అంతా భావిస్తున్నారు.

Tags:    

Similar News