జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే....ఇచ్చి పడేశారా ?
అదే జగన్ సొంత జిల్లా కడప అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీ రెడ్డి.
జగన్ అంటే ఏమిటి అంటే వైసీపీ వారు రకరకాలుగా చెబుతారు. సింహం అంటారు. ఎదురులేని నేత అంటారు. ఆయన తగ్గేదే లే అంటారు. వారి మటుకు ఇవన్నీ కరెక్టే అనుకున్నా ఇంతకీ ఆయన హోదా ఏమిటి అంటే కొత్తగా ఏర్పడిన 16వ శాసనసభలో జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని అంటున్నారు. అదే జగన్ సొంత జిల్లా కడప అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీ రెడ్డి.
ఆమె తాజాగా జగన్ మీద తీవ్ర విమర్శలే చేశారు. తనకు ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్ కి లేఖ రాశారు. దాని మీద గత రెండు రోజులుగా వైసీపీ నుంచే సెటైర్లు కామెంట్స్ విమర్శలు వస్తున్నాయి. ఇపుడు జగన్ సొంత జిల్లా కడప నుంచి మాధవీ రెడ్డి కూడా ఆయన మీద విమర్శలు చేశారు.
జగన్ 11 సీట్లతో అపోజిషన్ లీడర్ ఎలా అవుతారు అని ఆమె ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా అలా ఉందా అని నిలదీశారు. లోక్ సభలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ 54 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేయలేకపోవడం వల్లనే మెయిన్ అపొజిషన్ హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు.
అలాంటిది జగన్ కి ఎలా హోదా ఇస్తారు అని ప్రశ్నించారు. రాజ్యాంగన్ని మార్చి ఇవ్వాలా అని ఆమె సెటైర్లు వేశారు. 23 సీట్లతో చంద్రబాబు 2019లో అపోజిషన్ లీడర్ గా ఉంటే ఆయనను ఆ పదవి నుంచి దించేయాలని ఆరు మంది ఎమ్మెల్యేలను వైసీపీ గుంజే ప్రయత్నం చేసిందా లేదా అని ఆమె ప్రశ్నించారు.
అంతే కాదు సీఎం హోదాలో జగన్ ఉన్న ఎమ్మెల్యేలలో ఆరుగురు తీసేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని వ్యాఖ్యానించిన సంగతి అసెంబ్లీ రికార్డుల సాక్షిగా ఉందని ఆమె గుర్తు చేశారు. జగన్ అయిదేళ్ల పాటు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పాలన సాగించారని ఇపుడు కూడా రాజ్యాంగాన్ని మార్చి తనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా కోరుకుంటున్నారని మాధవీ రెడ్డి ఫైర్ అయ్యారు.
అలా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని ఆమె స్పష్టం చేశారు. నేను కడప ఎమ్మెల్యే, జగన్ పులివెందుల ఎమ్మెల్యే. నేను నా నియోజకవర్గంలో సమస్యలను సభలో ప్రస్తావిస్తాను, అందుకే జనాలు నన్ను ఎన్నుకున్నారు. జగన్ కూడా పులివెందులలో తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం సభకు వచ్చి మాట్లాడాలి తప్ప హోదా కోసం కాదని ఆమె సూచించారు.
ఇద్దరమూ ఇపుడు ఎమ్మెల్యేలమే అని ఆమె జగన్ కి తనదైన శైలిలో ఇచ్చి పడేశారు. జగన్ కి సభా సంప్రదాయాలు కూడా తెలియవని స్పీకర్ ఎన్నిక వేళ ఆయన గైర్ హాజరు కావడమే ఇందుకు నిదర్శనం అని ఆమె అన్నారు. మొత్తానికి చూస్తే జగన్ కి సొంత జిల్లాలోనే కడప రెడ్డెమ్మ ఇచ్చి పడేశారు అని అంటున్నారు. జగన్ ఏలుబడిలో బాధపడని వర్గం ఒక్కటి కూడా లేదని చెప్పడం ద్వారా మాధవీ రెడ్డి ఆయన బయటకు వెళ్ళకపోవడమే మంచిదని కూడా సూచించారు. వెళ్తే బాధిత జనాలు వెంటపడతారు, నిలదీస్తారు అని హెచ్చరించారు.