బాబుకు చెలగాటం .. రేవంత్ కు ప్రాణసంకటం !

ఈ నేపథ్యంలో తెలంగాణలో 13 అంశాలపై ఆరు గ్యారంటీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు మొదలయ్యాయి.

Update: 2024-06-14 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని 5 ఫైళ్ల మీద సంతకాలు చేసి 24 గంటలు గడవక ముందే తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి. పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ చంద్రబాబు 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీపై తొలి సంతకం, రెండో సంతకం ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు’పై పింఛన్లు రూ. 4 వేలకు పెంచుతూ మూడో సంతకం , అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్‌పై అయిదో సంతకం చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో 13 అంశాలపై ఆరు గ్యారంటీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు మొదలయ్యాయి. ‘ముఖ్యమంత్రి రేవంత్ పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పడి ఆరు నెలలైనా హామీలు అమలు చేయడం లేదు. ఏపీ లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై సంతకం పెట్టారు. చంద్రబాబు నాయుడు వృద్ధాప్య పెన్షన్లను 2 వేల నుంచి 4 వేలు పెంపు చేస్తూ సంతకం పెట్టారు. తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్లు 4 వేలు చేస్తా అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న, ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గత పెన్షన్ కలిపి 7 వేలు ఇస్తున్నారు’ అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో ఆరు నెలల అదనపు పెన్షన్ రూ.2 వేల చొప్పున కలిపి మొత్తం వృద్దులకు 12 వేలు పెన్షన్ ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి రేవంత్ ను డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 1 తరగతి నుంచి 10 తరగతి వరకు పంపిణీ చేసే పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చి మళ్ళీ తీసుకున్నారని. దీనివల్ల రాష్ట్ర ఖజానా పై భారం పడుతుందని, కేసీఆర్ బొమ్మ ఉందని ఇచ్చిన పుస్తకాలు తీసుకోవద్దని అన్నారు. పుస్తకాల పై జాతీయ గీతం ఉందని తెలిసింది దాన్ని తీసేయడం మంచి పద్దతి కాదని, ఏపీ లో గత ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నా కూడా చంద్రబాబు పుస్తకాలు పిల్లలకు పంపిణీ చేయాలని ఆదేశించారని గుర్తుచేశారు. ఏపీలో ప్రభుత్వం కొలువు దీరడంతో అక్కడికి ఇక్కడికి పోలికలు ప్రారంభం కావడంతో రేవంత్ కు ఇరకాటం తప్పదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Tags:    

Similar News