2000 కోట్ల డ్రగ్స్ కేసు.. 25 ఏళ్లకు ముంబైకి మమతా కులకర్ణి!
2016లో థానేలో నమోదైన రూ. 2000 కోట్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుకు సంబంధించి మమతా కులకర్ణి పేరు ప్రధానంగా మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది.
2016లో థానేలో నమోదైన రూ. 2000 కోట్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుకు సంబంధించి మమతా కులకర్ణి పేరు ప్రధానంగా మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. అయితే ఇటీవల బాంబే హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది. ఈ విజయం తర్వాత నటి మమత తన దేశానికి తిరిగి వచ్చింది. సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.
మమతా కులకర్ణి కుంభమేళా 2025కి హాజరు కావడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత తన దేశానికి తిరిగి వచ్చిన మమత తీవ్రమైన భావోద్వేగానికి గురైంది. ఈ సంధి కాలంలో తాను ఎంతగా ఇబ్బంది పడిందో కూడా ఈ వీడియోలో వివరించింది. మమతా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నవంబర్ 22న మమత కథానాయికగా నటించిన `కరణ్ అర్జున్` థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది.ఈ నటి చాలా సంవత్సరాలుగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంది. విదేశాలకు వెళ్లిందని గుసగుసలు వినిపించాయి. కానీ బతకడానికి ఆమె ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆమె విదేశాల్లో నివసిస్తున్నారని తెలుసు. అయితే మమత ఎట్టకేలకు 25 ఏళ్ల తర్వాత ముంబైకి తిరిగి వచ్చింది. న్యాయపరమైన చిక్కులు అధిగమించి చివరికి స్వదేశానికి వచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో మమత ఒక వీడియోను షేర్ చేసారు. దీనిలో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ``2012 కుంభమేళాలో పాల్గొన్నాను. మళ్లీ 25 సంవత్సరాల తర్వాత నా మాతృభూమికి తిరిగి వచ్చి, సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత మరో మహా కుంభమేళా 2025 కోసం తిరిగి వచ్చాను`` అని క్యాప్షన్ ఇచ్చింది.
భారతదేశానికి ముఖ్యంగా ముంబైకి తిరిగి వచ్చినప్పుడు తాను పొంగిపోయానని మమత ఈ వీడియోలో తెలిపింది. విమానం ల్యాండ్ అయ్యే ముందు ఆకాశం నుంచి తన దేశాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యానని చెప్పింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలోను భావోద్వేగానికి లోనైంది. రెండు దశాబ్దాల తర్వాత నేను పెరిగిన, ప్రేమించిన, నా కలలను నిర్మించిన నేలపై నేను నిలబడి ఉన్నాను. ముంబై మారిపోయింది.. కానీ నగరం స్ఫూర్తి శాశ్వతంగా ఉంది. ఇంటికి తిరిగి రావడం ఊహించనిది`` అని అన్నారు.
ఆమె 1992లో తిరంగాతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. కరణ్ అర్జున్ - సబ్సే బడా ఖిలాడి వంటి చిత్రాలలో బోల్డ్ & గ్లామరస్ పాత్రలతో వేగంగా పేరు తెచ్చుకుంది. అయితే 2000 ల ప్రారంభంలో తరచుగా వివాదాలు తన కెరీర్‌ని ఇబ్బంది పెట్టాయి. మమత నటించిన `కరణ్ అర్జున్` రీరిలీజ్ వేళ తనను కలవాలని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.