సీఎంలలో సెపరేటు రేవంత్...మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ...!
రేవంత్ రెడ్డిని ఆయన అనుసరించిన తీరుని చూసిన వారు అంతా రేవంత్ రెడ్డి టోటల్ సీఎంలలోకెల్లా సెపరేట్ గురూ అనేస్తున్నారు.
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఇపుడు మెగాభిమానులలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఓవర్ నైట్ ఆయన నిండైన మెగాభిమానాన్ని అందుకున్నారు. రేవంత్ రెడ్డిని ఆయన అనుసరించిన తీరుని చూసిన వారు అంతా రేవంత్ రెడ్డి టోటల్ సీఎంలలోకెల్లా సెపరేట్ గురూ అనేస్తున్నారు.
ఆయన డౌన్ టూ ఎర్త్ అని కూడా కీర్తిస్తున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం రేవంత్ రెడ్డి తెలంగాణాకు సీఎం అయ్యారు. ఆయన నాటి నుంచి తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కసిగా పనిచేస్తున్నారు. తెలంగాణా తొలి సీఎం గా ఉన్న కేసీయార్ బ్రాండ్ ఇమేజ్ ని దాటి కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం ఏ సీఎం కి అయినా కష్టమే. కానీ రేవంత్ మాత్రం తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ఉందని రుజువు చేసుకుంటున్నారు.
అతి తక్కువ వ్యవధిలో ఆయన అందరివాడుగా మారుతున్నారు. రీసెంట్ గా చూస్తే ఆయన మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా వ్యవహరించిన తీరు చూస్తే హాట్సాఫ్ అని అనిపించక మానదు. పద్మ పురస్కారం లభించిన సందర్భంగా చిరంజీవి కోడలు ఇచ్చిన విందుకు సీఎం హోదాను సైతం పక్కన పెట్టి రేవంత్ రెడ్డి హాజరు కావడం అందరికీ ఆశ్చర్యపరచింది.
అంతే కాదు కేక్ కట్ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మెగాస్టార్ తో కలసి ఫోటోలకు కనిపించారు. అంతకు ముందు పద్మ విభూషణ్ మెగాస్టార్ ని అనౌన్స్ చేయగానే రేవంత్ రెడ్డి అభినందనలు తెలియచేసి మరీ తన ప్రేమను చాటుకున్నారు. నిజానికి చూస్తే సీఎం స్థాయిలో ఉన్న వారు ఎవరూ ఇలాంటి సందర్భాలలో అవార్డీల ఇళ్లకు వెళ్ళడం అంటూ ఇప్పటిదాకా జరగలేదు. ప్రోటోకాల్ వంటివి వారు అనుసరిస్తారు.
వీలైతే తమ చాంబర్ కి రప్పించుకుని సత్కరించిన సంఘటనలు ఉన్నాయి. వాటినే ఇంతవరకూ అంతా హైలెట్ చేస్తూ వచ్చారు. కానీ ప్రోటోకాల్ ని సైతం పక్కన పెట్టేసి మరీ రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు గ్రేట్ అనే అంటున్నారు. అంతే కాదు అవార్డు ప్రకటించిన తరువాత వెను వెంటనే ప్రభుత్వం తరఫున గ్రాండ్ గా పౌర సన్మానం ఏర్పాటు చేయడం అక్కడ గొప్పగా మెగాస్టార్ ని సత్కరించడం అంటే నిజంగా రేవంత్ రెడ్డి ఆలోచనలు మెచ్చతగ్గవని అంటున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. తెలుగు వారి ఖ్యాతిని పెంచుతూ తన ప్రతిభను చాటే కళాకారులు కానీ ఇతర రంగాల వారు కానీ ఎవరైనా వారిని సత్కరించుకోవడం మన ధర్మం అన్నారు. సీఎం రేవంత్ చెప్పిన మాటలు నిజంగా గోల్డెన్ వర్డ్స్ అని అంటున్నారు. ఏ రాజ్యంలో అయినా కళాకారుల క్షేమం తో పాటు వారిని సత్కరించిన పాలకులు ఎపుడూ ఉన్నతంగానే వెలిగారు
మళ్లీ అలాంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి తెచ్చారు అని అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి పద్మ పురస్కారం అందించింది. కానీ తనదైన వ్యవహార శైలితో సింప్లిసిటీతో మొత్తం క్రెడిట్ ని రేవంత్ రెడ్డి కొట్టేశారు అని అంటున్నారు.
అంతే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నిండా ఉన్న మెగాభిమానుల అభిమానాన్ని ఆయన దీని ద్వారా అందుకున్నారు అని అంటున్నారు. నిజంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి వివాద రహితుడు. టాలీవుడ్ కి బిగ్ పిల్లర్, ఆయన దిగ్గజ నటుడు. ఆయన వివాదరహితుడు, అందరితో మంచిగా ఉంటారు. ఎవరినీ ఆయన నొప్పించారు. అలా అందరితో కలసి మెప్పిస్తూనే ముందుకు పోతారు.
అటువంటి చిరంజీవి అజాత శతృవు. ఆయన అంటే అందరికీ అభిమానం ఉంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. గతంలో ఏపీ ప్రభుత్వం పిలుపు మేరకు చిరంజీవి సీఈమో ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఆయన యావత్తు సినీ రంగం పక్షాన ముఖ్యమంత్రి జగన్ కి నమస్కారం చేశారు. అమ్మ స్థానంలో ఉన్న ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ని ఆదుకోవాలని ఆయన కోరుతూ ఒక పెద్దగా ఏపీ సీఎం కి చేసిన అభివాదం అది. ఒక విధంగా చిరంజీవి సంస్కారంగానే దాన్ని చూడాలి.
అయితే మెగాభిమానులు దానికి హర్ట్ అయినట్లుగా ప్రచారం సాగింది. కానీ సీన్ కట్ చేస్తే ఇపుడు మరో సీఎం ఈ విధంగా మెగాస్టార్ తో వ్యవహరించిన తీరుతో వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక్కడ ఎవరికీ తప్పు పట్టేది లేదు. ఎవరి వ్యవహార శైలి వారికి ఉంటుంది. కానీ మెగాభిమానులు మాత్రం చిరంజీవిని ఎక్కడా తగ్గరాదని చూస్తారు. అలా ఒక సీఎం గా రేవంత్ రెడ్డి తగ్గి వచ్చి మరీ మెగాస్టార్ ఇంటికి రావడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీస్ అంటున్నారు.
అదే సందర్భంలో తెలుగు సినీ పరిశ్రమకు అనేక మంది ముఖ్యమంత్రులు కృషి చేశారు. ఎవరి దారి వారిది. అయినా సరే ఏ ఒక్కరూ వ్యవహరించని తీరుని కనబరచి రేవంత్ రెడ్డి మెగా అభిమానులతో పాటు సాదర జనం వద్ద కూడా మంచి మార్కులు కొట్టేశారు అని అంటున్నారు.