తాజాగా తేల్చారు: టన్ను ఈ- వ్యర్థాల నుంచి ఎంత బంగారం వస్తుంది?

అంతకంతకూ పెరుగుతున్న సాంకేతికతకు తగ్గట్లే కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి ఈ-వ్యర్థాలు.

Update: 2025-02-10 06:30 GMT

అంతకంతకూ పెరుగుతున్న సాంకేతికతకు తగ్గట్లే కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి ఈ-వ్యర్థాలు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈ వ్యర్థాల్ని ఒక కొలిక్కి తీసుకురావటం పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి వేళ.. పర్యావరణానికి హాని కలగుకుండా ఈ వ్యర్థాల నుంచి బంగారాన్ని తీసే టెక్నాలజీని డెవలప్ చేయటమే కాదు.. ఈ ప్రాసెస్ లో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ను ప్రయోజనకర సేంద్రీయ పదార్థాలుగా మార్చే వీలుండేలా చేయటం మరో విశేషంగా చెబుతున్నారు. దీంతో ఈ- వ్యర్థాల బెడదతో పాటుఇటు పర్యావరణ సమస్యకు విరుగుడు లభిస్తుందని చెబుతున్నారు.

అంతకంతకూ పెరుగుతున్న ఎలక్ట్రానిక్ సాధనాల వినియోగంతో వాటి వ్యర్థాలు పెరుగుతున్నాయి. ప్రతి ఏటా 62 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. అందులో 20 శాతమే రీసైకిల్ అవుతున్నట్లు అంచనా. ఒక టన్ను ఈ - వ్యర్థాల్లో లభించే బంగారం .. ఒక టన్ను ముడి బంగారు ఖనిజం నుంచి అభ్యమయ్యే బంగారం కంటే పది రెట్లు ఎక్కువగా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి ప్రతి ఏడాది 80 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ- వ్యర్థాలు రానున్నాయి. అందుకే వాటి నుంచి స్వర్ణాన్ని వెలికి తీసే విధానాల్ని కనుగొనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ- వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికి తీసే సంప్రదాయ విధానంలో శక్తివంతమైూన రసాయనాలను ఉపయోగించాల్సి వస్తోంది. ఇందులో సైనైడ్ వాడకం ఎక్కువ. వీటితో పర్యావరణానికి హాని కలుగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు అమెరికాలోని కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని డెవలప్ చేశారు. ఇందులో హానికారక రసాయనాల వాడకం ఉండదు. వినైల్ లింక్డ్ కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ను రూపొందించారు.

ఈ విధానంలో బంగారాన్ని 99.99 శాతం ఒడిసిపట్టే సామర్థ్యం ఉంటుంది. ఇందులో సల్ఫర్ అధికంగా ఉండటం కారణంగా చెబుతున్నారు. సల్ఫర్ కు సహజసిద్ధంగా బంగారం ఇట్టే ఆకర్షితులవుతుంది. ఎలక్ట్రానిక్ సాధనాల్లో బంగారాన్ని వినియోగించటం తెలిసిందే. సర్క్యుట్లు.. మెమరీ చిప్ లలో కనెక్టర్లుగా వాడుతుంటారు. బంగారానికి తుప్పు పట్టే గుణం లేకపోవటం.. విద్యుత్ వాహకంగా ఉండటం.. ఈ లోహాన్ని ఎలాంటి షేప్ లో అయినామార్చుకునే వెసులుబాటు ఉండటం తెలిసిందే. కొత్తగా డెవలప్ చేసిన విధానంతో ఈ-వేస్టు నుంచి ఎలాంటి పర్యావరణహాని లేని రీతిలో బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ రానున్న రోజుల్లో భారీగా పెరుగుతుందంటున్నారు.

Tags:    

Similar News