శృతిమించిన వ్యాయామమే అతడి ప్రాణాలు తీసింది

ఆస్ట్రేలియాలో 21 ఏళ్ల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ అధిక తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయడం వల్ల వచ్చే అరుదైన కండరాల వ్యాధితో మరణించాడు.;

Update: 2025-03-21 19:03 GMT
శృతిమించిన వ్యాయామమే అతడి ప్రాణాలు తీసింది

ఆస్ట్రేలియాలో 21 ఏళ్ల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ అధిక తీవ్రత కలిగిన వ్యాయామాలు చేయడం వల్ల వచ్చే అరుదైన కండరాల వ్యాధితో మరణించాడు. ఇతడు ఫైటర్ గా.. వ్యక్తిగత ట్రైనర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల ప్రారంభంలో మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ ఫైట్ లో జేక్ సెండ్లర్ కుప్పకూలాడు. హానికరమైన టాక్సిన్‌లతో శరీరం నిండిపోయిందని.. రాబ్డోమయోలిసిస్‌తో జేక్ బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. జేక్ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స చేశారు. అయితే పరిస్థితి విషమించి జేక్ సెండ్లర్ మార్చి 13న మరణించాడు.. అతను బాడీ బిల్డింగ్ కోసం ఎంతో తీవ్రంగా కసరత్తులు చేసేవాడని.. అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడని అతని కుటుంబం తెలిపింది. అయితే చాలా రోజులు కోమాలో ఉన్న తర్వాత అతన్ని బతికించడం అసాధ్యం అని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పాడంతో వారు అతడికి మరణం ప్రసాదించారు. "మేము ఐసీయూలోకి వెళ్ళినప్పుడు, వైద్యుడు చాలా కణజాలం చనిపోయిందని..శరీరంలో చాలా నష్టం జరిగిందని, ఇక ఏమీ చేయలేమని చెప్పారు" అని జేక్ తల్లి షారోన్ సెండ్లర్ తెలిపారు. ఆ తర్వాత జేక్ మరణించాడు. అది నా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం" అని ఆమె అన్నారు.

-అసలేంటి వ్యాధి అంటే?

రాబ్డోమయోలిసిస్ వ్యాధి యొక్క అత్యంత తీవ్రమైన కేసుగా వైద్యులు తెలిపారు. రాబ్డోమయోలిసిస్ అనేది కండరాల కణజాలం విచ్ఛిన్నం కావడం వల్ల వస్తుంది. ఇది రక్తప్రవాహంలోకి ఒక విషాన్ని విడుదల చేస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతుంది. ఇది గుండె , ఇతర అవయవాలకు కూడా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కండరాల నొప్పి, అలసట , ముదురు రంగు మూత్రం దీని లక్షణాలు.

- వ్యాధి లక్షణాలున్నా నిర్లక్ష్యం చేసిన జాక్

మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కు సిద్ధమవుతున్న సమయంలో ఈ లక్షణాలు తీవ్రమవుతున్నప్పటికీ జేక్ వాటిని పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను చాలా చురుకుగా ఉండి.. తీవ్రంగా శిక్షణ పొందుతుండేవాడని.. అతని కండరాల నొప్పిని భరించాడని.. కానీ ఆందోళన చెందలేదన్నాడు. మూత్రం రంగు మారినప్పుడు డీహైడ్రేషన్ అయ్యానని భావించి ద్రవాలు ఎక్కువగా తీసుకున్నాడని తెలిపారు. జేక్ చాలా ఆరోగ్యంగా ఉండేవాడని, సేంద్రియ ఆహారాలు మాత్రమే తినేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

తన కుమారుడి ప్రాణాలు తీసిన ఈ తీవ్ర వ్యాయామం వల్ల వచ్చే వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అతడి షారోన్ సెండ్లర్ మీడియాకు వివరించాడు. తద్వారా ఇతర కుటుంబాలు మేము అనుభవించిన బాధను ఎప్పటికీ అనుభవించకూడదు" అని అన్నారు. జేక్ సెండ్లర్ జ్ఞాపకార్థం ఒక విరాళాల పేజీని కూడా ఏర్పాటు చేశారు. జేక్ రింగ్‌లో మాత్రమే కాకుండా జీవితంలో కూడా నిజమైన యోధుడు" అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. "అంకితభావం కలిగిన అథ్లెట్, దయగల శిక్షకుడు, ప్రియమైన కుమారుడు, సోదరుడు , స్నేహితుడు అయిన జేక్ దాతృత్వ హృదయం, అంతులేని శక్తి , మద్దతు అతన్ని తెలిసిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని" తండ్రి ఒక భావోద్వేగ ప్రకటనను జారీ చేశాడు.

Tags:    

Similar News