మోడీ అమిత్ షా కార్యకర్తలకు ఏమీ చేయలేదా...అందుకే ఈ రిజల్ట్ ?

దాంతో పాటు బీజేపీ లో పార్టీ జనాలను కీలక నేతలను కూడా పెద్దగా పట్టించుకోలేదు అన్న మాట ఇప్పటిదాకా అక్కడక్కడ వినిపిస్తూ వచ్చింది.

Update: 2024-08-26 17:20 GMT

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బాగా దెబ్బ తింది. ఎక్కడ 370 సీట్ల టార్గెట్ మరెక్కడ 240 సీట్లు ఏకంగా 130 సీట్లు తేడా కొట్టింది. అంతే కాదు మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా 273 సీట్లు కూడా తెచ్చుకోలేక చతికిలపడింది. దానికి కారణం బీజేపీ మీద జనాలకు మొహం మొత్తిందని అంతా అనుకున్నారు. అంతే కాదు బీజేపీ విధానాలను కూడా నచ్చుకోవడం లేదు అనుకున్నారు. పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీజేపీ పెద్దగా ప్రజలకు చేసింది ఏదీ లేదని భావించి ఈ ఫలితాలు వచ్చాయని కూడా అంతా విశ్లేషించారు.

అయితే ఇది కూడా నిజమే దీనితో పాటు మరో నిజం కూడా ఆలస్యంగా వెలుగు చూస్తోందా అన్న చర్చ సాగుతోంది. బయట జనాలతో పాటు పార్టీ జనాలు కూడా బీజేపీ పెద్దల మీద గుస్సా అయ్యారా అందుకే ఈ రిజల్ట్ వచ్చిందా అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది. బీజేపీ జనాలు ఎపుడూ పార్టీని అమితంగా ప్రేమిస్తారు. వారు ఎపుడూ పార్టీ స్టాండ్ కి భిన్నంగా పోరు.

కానీ నరేంద్ర మోడీ అమిత్ షా జమానాలో బీజేపీ రూపూ షేపూ మారిపోయాయని చర్చ కూడా సాగింది. బీజేపీలో వ్యక్తి పూజ అధికం అయింది. దాంతో పాటు బీజేపీ లో పార్టీ జనాలను కీలక నేతలను కూడా పెద్దగా పట్టించుకోలేదు అన్న మాట ఇప్పటిదాకా అక్కడక్కడ వినిపిస్తూ వచ్చింది. మరి పదేళ్ల బీజేపీ ఏలుబడి మీద పార్టీ జనాలకు కూడా ఈ తీరు వ్యహారం చూసి విసుగెత్తిందేమో ఈసారి ఎన్నికల్లో కొంచెం తేడాగానే పనిచేసారు అని అంటున్నారు.

దానికి నిదర్శనమే సోషల్ మీడియాలో బీజేపీ సైన్యం బాగా నీరసించింది అని అంటున్నారు. అది కూడా సరిగ్గా ఎన్నికల వేళ అంతా కురుక్షేత్ర యుద్ధానికి సమాయత్తం అవుతున్న వేళ డూ ఆర్ డై బాటిల్ కి రంగం సిద్ధం అయిన వేళ బీజేపీ సోషల్ మీడియా మిలటరీ పెద్దగా ఫోకస్ పెట్టలేదా అన్న చర్చ సాగుతోంది.

ఎందుకు అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా సైన్యం అయితే వీర విహారమే చేసింది. అందులో నాలుగవ వంతు మాత్రమే బీజేపీ సైన్యం సోషల్ మీడియా ఫైట్ ఇచ్చింది అంటే అశ్చర్యపోవాల్సిందే. బీజేపీకి సోషల్ మీడియా అతి పెద్ద ఊపిరి. మోడీ 2014లో అధికారంలోకి అలాగే వచ్చారు. 2019లో అయితే దేశానికి రక్షకుడిగా సోషల్ మీడియా చితీకరించింది. ఇపుడు 2024 ఎన్నికల్లో మాత్రం మోడీ ప్రభుత్వాన్ని సరిగ్గా కాస్కో లేకపోయింది అని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ అయింది.

ఆ వివరాలు చూస్తే ఏడాది మార్చి 16 నుంచి మే 30 వరకూ అంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకూ ఒక నెలన్నర రోజులలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అదరగొట్టేసింది. ఈ సమయంలో కాంగ్రెస్ కి యూట్యూబ్ లో 61.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. అదే బీజేపీకి మాత్రం 15 కోట్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి.

అలాగే ఎక్స్ లో కాంగ్రెస్ 2500 నుంచి 3000 దాకా లైక్స్ వచ్చాయి. ఇక బీజేపీకి ఎక్స్ లో 260 నుంచి 300 మాత్రమే లైక్స్ వచ్చాయంటే ఇది పది శాతంగా ఉంది అన్న మాట. ఇక ఇన్స్టాగ్రాం లో కాంగ్రెస్ కి 1.22 లక్షల లైక్స్ రాగా బీజేపీకి వచ్చినవి కేవలం 22,945 లైక్స్ మాత్రమే. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ సోషల్ మీడియా సైన్యం ఎంత సిన్సియర్ గా పనిచేసింది అన్నది అర్థం అవుతోంది. అదే బీజేపీ మాత్రం వెనకబడిపోయింది అని నటున్నారు.

దీనిని చూసిన వారు మోడీ అమిత్ షా బీజేపీ కార్యకర్తలకు ఏమీ చేయలేదా అని సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ అంటేనే సిద్ధాంత బద్ధమైన పార్టీ. అలాంటి పార్టీలో ఈ నీరసత్వం నిస్సత్తువ కచ్చితంగా చర్చనీయాంశాలు. ఇదే తీరున బీజేపీ సోషల్ మీడియా వైఖరి కనుక ఉంటే రానున్న రోజులలో మరింత దెబ్బ పడుతుంది అని అంటున్నారు. దీనిని బట్టి బీజేపీ పెద్దలు చక్కదిద్దుకునేలా చర్యలు చేపడతారేమో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News