మిత్రులకు బీజేపీ విదిలించిందెంత ?

ఏదో ఇచ్చినట్లుగా మిత్రులకు కొన్ని మంత్రి పదవులు అలా విదిలించింది అని అంటున్నారు నిజానికి మిత్రులు లేకపోతే బీజేపీ బండి కదిలేదే లేదు.

Update: 2024-06-10 04:00 GMT

బీజేపీ అంటే తాను అతి పెద్ద జాతీయ పార్టీ అన్న భావంతో ఉంది. సీట్లు తగ్గినా కూడా అదే తీరుని కనబరుస్తోంది అన్నది మంత్రి వర్గ ప్రమాణం లోనే తేలిపోయింది. ఏదో ఇచ్చినట్లుగా మిత్రులకు కొన్ని మంత్రి పదవులు అలా విదిలించింది అని అంటున్నారు నిజానికి మిత్రులు లేకపోతే బీజేపీ బండి కదిలేదే లేదు.

కానీ మొత్తం 72 మంది మంత్రులతో మోడీ జంబో కేబినెట్ ని ఏర్పాటు చేస్తే ఎన్డీయే మిత్రులు అందరికీ కలుపి దక్కినవి పట్టుమని పదకొండు పదవులు మాత్రమే. మిగిలినవి అన్నీ బీజేపీ ఖాతాలోకే పోయాయి ఇక ఇందులో కూడా కేబినెట్ ర్యాంక్ పదవులు దక్కించుకున్న వారు ముగ్గురు నలుగురు తప్ప ఎవరూ కారు. ఆ ఏడెనిమిది మందికీ సహాయ మంత్రి పదవుకే దక్కాయి. మరి బీజేపీతో కలసి వెళ్ళినందుకు వచ్చిన లాభమేంటి అన్నది చూడాల్సి ఉంది. కర్నాటకలో కేవలం రెండు ఎంపీ సీట్లు మాత్రమే గెలిచిన కుమారస్వామికి ఒక కేబినెట్ బెర్త్ ఇచ్చారు.

అదే 16 మంది ఎంపీలు గెలిచిన టీడీపీకి కూడా ఒక్కటే కేబినెట్ పదవి ఇచ్చారు. కాకపోతే మరోటి సహాయ మంత్రి పదవి దక్కింది. ఇక రెండు ఎంపీ సీట్లు దక్కిన జనసేనకు ఒక్కటైనా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో తెలియదు అంటున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీ కీలక శాఖలను తన దగ్గరే అట్టేబెట్టుకుంది. మిత్రులను బీజేపీ ఎలా లైట్ తీసుకుంటుందో చూడాలీ అంటే మహారాష్ట్ర ఉదంతం చూడాలి. ఒకనాడు కేబినెట్ మంత్రిగా చేసిన ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కి ఈసారి సహాయ మంత్రి ఇస్తామని చెప్పింది బీజేపీ. ఆయన వద్దు అంటే ఓకే అని మిన్నకుంది. అంటే తాము ఇచ్చిన పదవులే తీసుకోవాలి అన్న థియరీ ఏదో అప్లై అవుతోంది అన్న మాట.

మరి మెజారిటీ లేకపోయినా బీజేపీ పంతమే నెగ్గుతున్నపుడు మిత్రులకు కేవలం మొక్కుబడిగా పదవులు ఇస్తున్నపుడు బీజేపీతో ఉంటే ఏమి బాగుపడతారు, ఏమి నిధులు వస్తాయన్నది ఏపీ వంటి రాష్ట్రాలు ఆలోచన చేయాలి. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదు కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టి చూడాల్సి ఉంది.

అయితే బీజేపీ మంత్రివర్గం కూర్పు సింహభాగం ఆ పార్టీ తీసుకోవడం వంటివి చూస్తే రాష్ట్రాల డిమాండ్లు ఏవీ తీర్చే ధోరణి అయితే కనిపించడం లేదు అనే అంటున్నారు. ఒక్కసారి గద్దెనెక్కితే మెజారిటీ ఎలా సంపాదించాలో బీజేపీకి బాగా తెలుసు అని విపక్షాలు అంటున్నాయి. అందువల్ల మిత్రపక్షాలతో పాటు ఏ పార్టీకి చెందకుండా తటస్థంగా ఉన్న వైసీపీ బిజూ జనతాదళ్ వంటి పార్టీలు అలెర్ట్ కావాల్సిందే.

Tags:    

Similar News