ఆ అయిదుగురు విషయంలో మోడీ నమ్మకం అదే !
మోడీ ఆ అయిదుగురు విషయంలో మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో మొత్తం 72 మంది మంత్రులు చేరారు. వీరిలో అందరికీ శాఖల కేటాయింపు జరిగింది. మోడీ ఆ అయిదుగురు విషయంలో మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు.
అందుకే వారి శాఖలలో ఎలాంటి మార్పు లేదు. హోం మంత్రిగా అమిత్ షా కంటిన్యూ అవుతున్నారు. రక్షణ శాఖ రాజ్ నాధ్ కే ఇచ్చేశారు. అలాగే నితిన్ గడ్కరీకి రోడ్లు, రహదారుల శాఖను కొనసాగించారు. ఆర్ధిక మంత్రిగా మరోసారి నిర్మలా సీతారామన్ ఉంటారు. అదే విధంగా విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్ జై శంకర్ నే మళ్లీ మోడీ ఎంచుకున్నారు.
వీరు మోడీ గత ప్రభుత్వంలో ఆయా శాఖలలో రాణించారు కాబట్టే అవే శాఖలు ఇచ్చారు అని అని అంటున్నారు. ఇక మిగిలిన వారి విషయం తీసుకుంటే జేపీ నడ్డాకు కీలకమైన ఆరోగ్యశాఖ దక్కింది. అలాగే, సీనియర్ మోస్ట్ లీడర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ కి వ్యవసాయ మంత్రిత్వశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలను కట్టబెట్టి గౌరవించారు. మరో మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి ఇంధన మంత్రిత్వశాఖ, పట్టణాభివృద్ధి శాఖ, విద్యుత్ గృహ నిర్మాణశాఖ వంటి బాధ్యతలను అప్పగించారు.
ఇక అశ్వినీ వైష్ణవ్ కి రైల్వే సమాచార ప్రసార శాఖలను కేటాయించారు. మరో మంత్రి పీయూష్ గోయల్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇచ్చారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ కి సైతం గతంలో ఇచ్చిన విద్యాశాఖనే కొనసాగించారు. హర్దీప్ సింగ్ పూరి కి పెట్రోలియం శాఖ ఇచ్చారు. బీహార్ నుంచి గెలిచిన యువ నేత రాం విలాస్ పాశ్వాన్ తనయుడు అయిన చిరాగ్ పాశ్వాన్ కి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వంటి కీలకమైన శాఖను ఇచ్చారు. ఏపీ నుంచి టీడీపీ తరఫున కేబినెట్ లో చేరిన రామ్మోహన్నాయుడు కి పౌర విమానయాన శాఖ వంటి ప్రాధాన్యత కలిగిన శాఖనే ఇచ్చారు.
అదే విధంగా అన్నపూర్ణాదేవి కి మహిళా, శిశు అభివృద్ధి, సీఆర్ పాటిల్ కి జలశక్తి, శర్బానంద సోనోవాల్ కి ఓడరేవులు, షిప్పింగ్, శోభ కరంద్లాజే కి చిన్న, మధ్య తరహా పరిశ్రల సహాయ మంత్రి, రావ్ ఇంద్రజిత్ సింగ్ కి సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి హోదాలో ఇచ్చారు. ఇక భూపేంద్ర యాదవ్ కి పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు శాఖ కిరణ్ రిజిజు కి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇచ్చారు. అదే విధంగా కర్నాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామికి ఉక్కు శాఖను కేటాయించారు. అలాగే రవనీత్ సింగ్ బిట్టుకి మైనార్టీ వ్యవహారాల శాఖ జ్యోతిరాదిత్య సింధియాకి టెలికమ్యూనికేషన్ శాఖ ఇచ్చారు.
గజేంద్ర సింగ్ షెకావత్ కి పర్యాటక శాఖ, ప్రహ్లాద్ జోషికి ఆహారం, వినియోగదారుల సేవలు, సురేష్ గోపికి టూరిజం శాఖ సహాయ మంత్రిగా, రావ్ ఇంద్రజిత్ సింగ్ కి సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా ఇచ్చారు. తెలంగాణాకు చెందిన జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ఇచ్చారు. అలాగే బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చారు.
గిరిరాజ్ సింగ్ కి టెక్స్‌టైల్స్ శాఖ, ఏపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణ, కమ్యూనికేషన్ శాఖ ఇస్తే శ్రీనివాసవర్మ కి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి బాధ్యతలు ఇచ్చారు. అలాగే జితన్ రామ్ మాంఝీకి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఇచ్చారు. అదే విధంగా లల్లన్ సింగ్ కి ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖను ఇచ్చారు.