అయిన వారు నేరస్థులైనా.. అడుగు పడదు: మోడీ పాలన తీరిది!
అసలు నాతో సంబంధం లేదన్నప్పుడు నన్ను ఎలా విచారిస్తారనేది ఆయన ప్రశ్న.
తెరచాటున చూస్తే.. దేశవ్యాప్తంగా కేసుల బూచితో తమను ప్రశ్నిస్తున్నవారిని అరెస్టు చేయడం.. తమకు సహకరిస్తున్నవారు తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నా.. వారిని రక్షిస్తున్నారనే వాదన ప్రధాని నరేంద్ర మోడీపై బలంగా పడింది. ఉదాహరణకు.. కేజ్రీవాల్ కు మద్యం కుంభకోణానికి సంబంధం లేదని.. గతంలోనే ఈడీ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే.. అసలు ఏం జరిగిందో విచారిస్తామని మాత్రమే నోటీసులు పంపింది. దీనినే కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. అసలు నాతో సంబంధం లేదన్నప్పుడు నన్ను ఎలా విచారిస్తారనేది ఆయన ప్రశ్న.
దీనికి సమాధానం చెప్పకుండా.. ఆయనను అరెస్టు చేశారు. ఇక, తెలంగాణలోని ఎమ్మెల్సీ కవితను కూడా.. ఇదే ఆరోపణలపై అరెస్టు చేశారు. ముందు అసలు ఆమెను అరెస్టు చేయబోమని చెప్పారు. కానీ, తర్వాత అరెస్టు చేశారు. ఇక్కడ బీజేపీ వ్యూహం బీఆర్ ఎస్ దూకుడు తగ్గితే.. తెలంగాణలో ఓట్లు రాల్చుకోవడం. అదేవిధంగా ఢిల్లీలో కేజ్రీవాల్ దూకుడు తగ్గితే అక్కడ పాగా వేయడం అనే లక్ష్యాలు పెట్టుకుంది. పోనీ.. ఇవేవన్నా.. హత్యలు, నేరాలా? అంటే.. కాదు. పైగా 100 కోట్ల వ్యవహారం. అయితే.. వీరు రాజకీయంగా మోడీకి కంట్లో నలుసులు. అందుకే ఈ అరెస్టులు.
కట్ చేస్తే.. ఏపీ విషయానికి వద్దాం.. ఇక్కడ సీఎం జగన్‌పై 43 వేల కోట్ల రూపాయల అవకతవకల కు సంబంధించి కేసులు నమోదయ్యాయి. కానీ, ఆయన మోడీకి దత్తపుత్రుడని బీజేపీనే చెబుతోంది. దీంతో ఆ కేసులు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాయి. మరోవైపు ఆయన చిన్నాన్న దారుణ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ ఊసును దర్యాప్తు సంస్థలు ఎప్పుడో మరిచిపోయాయి. దీనికి కారణం.. మోడీ స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్!!
అందుకే.. ఇప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోయినా.. వివేకా కేసులో అడుగులు పడడం లేదు. కఠిన ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. నేతలకు బెయిల్ గప్‌చుప్ కాకుండా దక్కేస్తోంది. కానీ, కేజ్రీవాల్ సహా ఆయన మంత్రి వర్గంలోని వారికి(మాజీలు) మాత్రం బెయిల్ రాదు. అంతెందుకు.. 90 శాతం అంగవైకల్యంతో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబును తన తల్లిని చూసేందుకు(92 ఏళ్లు) అనుమతించని పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపించింది. సో.. అయినవారైతే.. హంతకులైనా.. నేరస్తులైనా. మిత్రేలే!!