ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాదీ మృతి... తెరపైకి ఏజెంట్ల మోసాలు!

అయితే ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంళో ఒక భారతీయుడు హత్యమైనట్లు రష్యాలోని రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ పెట్టిందని ఒవైసీ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-03-07 05:33 GMT

భారత్ లోని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి, అధిక జీతాలు వస్తాయని చెప్పి విదేశాలకు పంపించే ఏజెంట్లు చేసే మోసాలు అన్నీ ఇన్నీ కావనేది తెలిసిన విషయమే. వారు చేసే మోసాల వల్ల ఎంతోమంది దేశం కాని దేశంలో నానా ఇబ్బందులూ పడుతుంటారు. ఈ క్రమంలో ఇలానే మోసపోయి రష్యా వెళ్లిన హైదరాబాద్ నివాసి ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో మృత్యువాత పడ్డాడు. దీంతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయ్యింది.

అవును... అత్యధిక వేతనాలు అని చెప్పి ఒక్కొక్కరి వద్దా సుమారు రూ. 3 లక్షల వరకూ తీసుకున్న ఏజెంట్లు... రష్యా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు అని చెప్పి పంపించిన విషయం ఇటీవల తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ వాసి అస్పాన్ మృతిచెందాడు. 31 డిశెంబర్ 2023న చివరిసారిగా కుటుంబ సభ్యులతో అస్పాన్ మాట్లాడినట్లు తెలుస్తుంది.

వాస్తవానికి... మహ్మద్ అస్ఫాన్ తో పాటు మరికొంతమంది యువకులు ఎదుర్కొంటున్న కష్టాలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గత నెలలోనే ప్రస్థావించారు. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కు లేఖ రాశారు. ఇదే సమయంలో ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యాకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న యువకులను భారత్ కు సురక్షితంగా రప్పించాలని ప్రధాని మోడీకి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

అయితే ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంళో ఒక భారతీయుడు హత్యమైనట్లు రష్యాలోని రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ పెట్టిందని ఒవైసీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాదీ అస్ఫాన్ మృతిచెందినట్లు ఆ పోస్టులో ధృవీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అస్ఫాన్ మరణం గురించి ఒవైసీ ద్వారా తమకు తెలిసిందని కుటుంబ సభ్యులు తెలిపారు!

Tags:    

Similar News