రూ.5 వేలు అప్పు తీర్చలేదని దారుణం... వీడియో వైరల్!

ఈ సమయంలో సదరు బాదితుడి కుటుంబ సభ్యులు ఈ వ్యవహారాన్ని వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది.

Update: 2024-03-24 12:30 GMT

తీసుకున్న ఐదు వేల రూపాయల అప్పు వడ్డీతో సహా చెల్లించలేదని దాష్టికానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. ఆ ఐదు వేలు కాస్తా వడ్డీతో కలిపి ఇంకా పేరిగిందని.. అది మొత్తం చెల్లించాలని.. పిడిగుద్దులు గుద్దాడు! ఇంటికి పిలిపించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సమయంలో సదరు బాదితుడి కుటుంబ సభ్యులు ఈ వ్యవహారాన్ని వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది.

అవును... వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న ఐదువేల రూపాయల అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిని దారుణంగా హింసించారు. ఇందులో భాగంగా... బాధితుడిపై పిడిగుద్దులు గుద్దాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అప్పు వసూలు చేసే పద్దతి ఇది కాదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... తాండూరు టౌన్ లోని రాజీవ్ కాలనీలో బాలయ్య అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ సమయంలో అదే పట్టణానికి చెందిన రవి అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండటంతో.. అతని వద్ద వ్యక్తిగత అవసరాల నిమిత్తం మూడు నెలల క్రితం రూ. 5 వేలు అప్పుగా తీసుకున్నాడు. అందుకు ప్రతినెలా వడ్డిగా రూ. 500 చెల్లించాలని అప్పుపత్రం రాసుకున్నట్లు తెలుస్తుంది!

ఈ సమయంలో తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి రూ.6,500 అయ్యిందంట. అయితే ఈ ఆరువేల ఐదొందలలోనూ బాలయ్య రూ.3000 చెల్లించాడట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు వడ్డీ వ్యాపారి రవి... బాలయ్యను ఇంటికి పిలిపించి యువకుడిపై దాడికి తెగబడ్డాడు, ఈ క్రమంలో విచక్షణా రహితంగా పిడిగుద్దులు గుద్దినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారాన్నంతా కుటుంబ సభ్యులతో వీడియో తీయించాడు!

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధిక వడ్డీకి డబ్బులు అప్పుగా ఇవ్వడమే నేరమైతే... సుమారు సగం చెల్లించిన తర్వాత కూడా ఇలా హింసించడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలి కానీ.. ఇలాంటి పనులకు పాల్పడటం సరైన చర్య కాదని అంటున్నారు. మరి ఈ వ్యవహారంపై పోలీసులు, అధికారులు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!


Full View


Tags:    

Similar News