మ‌స్క్ బ‌యోగ్ర‌ఫీ హాట్ కేక్.. భ‌లే ర‌సికుడు

ప్రొఫెసర్ వాల్టర్ సెఫ్ ఐజాక్సన్ (Walter Seff Isaacson) క‌లం నుంచి వెలువ‌డిన ఈ పుస్త‌కంలో మ‌స్క్ రాస‌లీల‌లు, అక్ర‌మ సంబంధాలు, ఆయ‌న విజ‌య ర‌హ‌స్యాలు వంటి అన్ని విష‌యాలు స‌మ‌గ్రంగా ఉన్నాయ‌ట‌.

Update: 2023-09-26 23:30 GMT

వ్యాపార రంగంలోనే కాకుండా వ్య‌క్తిత్వ వికాస పాఠంగా కూడా సుప్ర‌సిద్ధుడిగా పేరొందిన అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్ ప్ర‌తి నిర్ణ‌యం ఓ సంచ‌ల‌న‌మే. అలాంటి మ‌స్క్ జీవితం గురించి మ‌రింత‌గా తెలుసుకోవాల‌ని అంద‌రికీ ఆస‌క్తి స‌హ‌జ‌మే. అలాంటి ఆస‌క్తి నేప‌థ్యంలోనే విడుద‌లైన మ‌స్క్ బ‌యోగ్ర‌ఫీ హాట్ కేకులుగా అమ్ముడుపోతోంది. ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ మాజీ సీఈవో ప్రొఫెసర్ వాల్టర్ సెఫ్ ఐజాక్సన్ (Walter Seff Isaacson) క‌లం నుంచి వెలువ‌డిన ఈ పుస్త‌కంలో మ‌స్క్ రాస‌లీల‌లు, అక్ర‌మ సంబంధాలు, ఆయ‌న విజ‌య ర‌హ‌స్యాలు వంటి అన్ని విష‌యాలు స‌మ‌గ్రంగా ఉన్నాయ‌ట‌.

ర‌చ‌యిత‌గా సుప్ర‌సిద్ధుడైన ఐజాక్స‌న్ గంలో... ఐన్‌స్టీన్‌, బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ పుస్తకాలు రాశారు. యాపిల్‌ కోఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌ బయోగ్రఫీని కూడా ఆయ‌న‌ రాశారు. స్టీవ్‌ జాబ్స్‌ మరణించిన వారం రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని విడుదల చేయ‌గా ఏడు రోజుల్లోనే 3,83,000 కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. అంత‌టి పెన్ ప‌వ‌ర్ ఉన్న వాల్టర్‌ ఐజాక్సన్ తాజాగా ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీని రాశారు. ఈనెల 12 న విడుదల చేయగా మార్కెట్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తూ కేవలం వారం రోజుల వ్యవధిలోనే 92,560 అమ్ముడుపోయాయి.

ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీ రాసేందుకు వాల్టర్ సుమారు రెండేళ్ల పాటు అన్ని కోణాల్లోనూ శ్రమించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మస్క్‌ అనుచరుల్ని, సలహాదారుల‌ను క‌లిసి సమాచారం సేకరించారు. దీంతోపాటుగా మస్క్ పాల్గొనే స‌మావేశాలు, ఆయ‌న ఇచ్చిన వివిధ‌ ఇంటర్వ్యూలు స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేసి ఈ బుక్‌ రాశారు. అందుకే మ‌స్క్ బ‌యోగ్ర‌ఫీలో ఆయ‌న జీవితం స‌మ‌గ్రంగా ఉంది. అంటే మ‌స్క్‌ బాల్యం, తన తండ్రి ఎర్రోల్‌ మస్క్‌తో ఉన్న అనుబంధం, ఎదుగుతున్న ద‌శ‌లోని బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అన్నీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు.

వివిధ రూపాల్లో సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం మస్క్‌ మాజీ భార్యలు, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌లు, పలువురు మహిళలతో క‌లిగి ఉన్న సంబంధాలు, వారికి క‌లిగిన సంతానం వంటి అనేక ఆస‌క్తిక‌ర విషయాలు మస్క్‌ జీవిత చరిత్రలో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు పేర్కొన్నార‌ట‌. ఇక త‌న ఎదుగుద‌లలో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం బిల్‌గేట్స్‌తో వాగ్వాదం, టెస్లా కార్ల షేర్ల తగ్గింపు వెనుక కార‌ణాలు వంటివ‌న్నీ ఈ బయోగ్రఫీలో ఐజాక్స‌న్‌ రాశారట‌. అందుకే మ‌స్క్ సైతం ఈ బ‌యోగ్ర‌ఫీపై స్పందించారు. . 'నా ఫోటోలు ఇంత క్లోజప్‌లో చూడటానికి విచిత్రంగా ఉన్నాయి. అయినా... చాలా బాగుంది అంటూ' త‌న బ‌యోగ్ర‌ఫీ ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News