.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

జైరాంకు లోకేశ్ భారీ పంచ్.. సూటిగా ఇచ్చేశారుగా

వాదనలకు దిగటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి ఆయన.. అడ్డంగా దొరికిపోయిన ఉదంతాన్ని టేకప్ చేసిన ఏపీ మంత్రి లోకేశ్ భారీగా ఇచ్చేశారు

Update: 2024-07-01 11:25 GMT

వాదనలకు దిగటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి ఆయన.. అడ్డంగా దొరికిపోయిన ఉదంతాన్ని టేకప్ చేసిన ఏపీ మంత్రి లోకేశ్ భారీగా ఇచ్చేశారు. వెనుకా ముందు చూడకుండా.. తాను వాడే ప్రతి మాటను ఆచితూచి అన్నట్లుగా వాడుతూ.. జైరాం నోట మాట రాకుండా ఇచ్చేస్తూ లోకేశ్ చేసిన ట్వీట్ పంచ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ.. ఆదివారం తన మానసపుత్రిక అయిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఏపీకి చెందిన అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం.. దానికి సంబంధించిన ఒక ఫోటోను ఎక్స్ లో పోస్టు చేశారు. అప్పుడెప్పుడో చంద్రబాబు తో కలిసి తాను అరకు కాఫీని తాగిన సందర్భాన్ని షేర్ చేసుకున్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు.. అరకు కాఫీ గురించి మోడీ మాట్లాడటాన్ని స్వాగతిస్తూ.. మరోసారి అరకు కాఫీని మోడీతో కలిసి తాగే అవకాశం కూడా తాను ఎదురుచూస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఏపీలోని అరకు ప్రాంతంలో గిరిజనులు పండించే అరకు కాఫీ ఫేమస్ కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అరకు కాఫీపై మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్. ‘‘అరకు ఆర్గానిక్ కాఫీ బ్రాండ్ ను తానే కనిపెట్టినట్టు మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ముద్ర వేసుకన్నారు’’ అంటూ జైరాం రమేశ్ ఎక్స్ లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించిన నారా లోకేశ్.. ‘‘జాతీయ పార్టీ నాయకులైన మీ నుంచి మర్యాద.. నిజాయతీ ఆశిస్తున్నా. అరకు కాఫీ గురించి ప్రధాని మోడీ గొప్పగా చెప్పారు. దశాబ్దాలుగా క్రియాశీలకంగాఉన్న గిరిజన సహకార సంఘం గురించి స్పష్టంగా వివరించారు. ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు.. షేర్ చేసిన ఫోటోలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మీరు వ్యక్త పర్చినట్లుగా మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు’’ అంటూ సూటిగా ఇచ్చి పడేశారు మంత్రి లోకేశ్.

Tags:    

Similar News