పో*ర్న్ స్టార్ వ్యవహారం... ట్రంప్ కు షాకిచ్చిన న్యూయార్క్ కోర్టు!

అవును... వచ్చే ఏడాది జనవరిలో అమెరికాకు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది.

Update: 2024-12-17 05:21 GMT

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఆయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... పో*ర్న్ స్టార్ కు హష్ మనీ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలు విషయంలో న్యూయార్క్ కోర్టు షాకిచ్చింది.

అవును... వచ్చే ఏడాది జనవరిలో అమెరికాకు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. ఇందులో భాగంగా... గతంలో సంచలనం సృష్టించిన పో*ర్న్ స్టార్ కు హస్ మనీ కేసులో ఊహించని దెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి జువాన్ మర్చన్... అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని.. ఇలాంటి అనధికారిక వ్యవహారాల విషయంలో ఎలాంటి రక్షణ వర్తించదని స్పష్టం చేశారు. దీంతో.. శిక్ష అభియోగాలు ఎదుక్రొంటు వైట్ హౌస్ లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

కాగా... గతంలో సంచలనం సృష్టించిన హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ ఏడాది నవంబర్ లో ఆయనకు న్యూయర్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అయితే... ఆ సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో... ఓ కీలక విషయాన్ని ప్రస్థావిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

ఇందులో భాగంగా... అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని.. ఆ విషయాన్ని ప్రస్థావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారని అంటారు. దీంతో... న్యాయస్థానం ఈ కేసును ఇటీవల విచారణ జరిపి.. శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది! అయితే.. ట్రంప్ కు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తాజాగా తేలిందని అంటున్నారు. దీంతో... వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది.

ఏమిటీ హష్ మనీ కేసు..?:

పో*ర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ తో గతంలొ ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు డొనాల్డ్ ట్రంప్ పై ఉన్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన 2016 ఎన్నికల సమయంలో ఈ వ్యవహారంపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు.. తన తరుపు న్యాయవాదుల ద్వారా 1.30 లక్షల డాలర్ల హష్ మనీని ఇప్పించారనేది ప్రధాన ఆరోపణ.

దీనికి తోడు.. ఎన్నికల కోసం తనకు అందిన వివరాళలా నుంచి ఈ మొత్తాన్ని ఆమెకు చెల్లించారని.. లెక్కల్లో మాత్రం ప్రచారానికి ఖర్చు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారనేది అభియోగం. ఇలా... ఈ వ్యవహారం మీద ట్రంప్ పై మొత్తం 34 అంశాల్లో నేరారోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో మొత్తం 22 మంది సాక్ష్యులను విచారించారు.

ప్రధానంగా... డొనాల్డ్ ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమే అని స్టార్మీ కూడా వాంగ్మూలం ఇచ్చారు. దీంతో... ట్రంప్ పై మోపబడిన అభియోగాలన్నీ నిజమేనని ఆరు వారాల విచారణ తర్వాత 12 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయానికి వస్తూ తీర్పు వెలువరించింది.

Tags:    

Similar News