జేసీ బ్రదర్స్ ఇద్దరిలో ఒకరికే టిక్కెట్... కారణం ఇదేనట!

దీంతో చాలా మంది సీనియర్లకు సైతం బాంబు మొండిచెయ్యి చూపించాల్సి వస్తుంది.

Update: 2024-01-28 10:59 GMT

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో టీడీపీకి జనసేనతో పొత్తులో భాగంగా ఈదఫా సీట్ల సర్దుబాట్లు ఒకెత్తు అయితే.. అభ్యర్థుల ఎంపిక మరొకెత్తు అని అంటున్నారు. దీంతో చాలా మంది సీనియర్లకు సైతం బాంబు మొండిచెయ్యి చూపించాల్సి వస్తుంది. అయితే వారంతా కూల్ గానే అర్ధంచేసుకుని సర్ధుకుపోతారా.. లేక, రెబల్స్ గా మారి అసలుకే ఎసరు తెస్తారా అనేది కీలకం కాబోతుంది! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా జేసీ బ్రదర్స్ కి టిక్కెట్లు కేటాయింపులో బాబు కాస్త గట్టిగానే ఉన్నారని అంటున్నారు!

అవును... ప్రస్తుతం "రా.. కదలిరా" సభలతో బిజీగా ఉంటున్న బాబు.. మరోపక్క అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తులు సీరియస్ గా చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో మొహమాటాలకు తావులేదని చెబుతున్నారని తెలుస్తుంది. ఈ కామెంట్లకు బలం చేకూర్చేలాగా... తాజాగా అనంతపురంలో జేసీ బ్రదర్స్ ని సగమే సంతృప్తి పరిచారని తెలుస్తుంది. ఇందులో భాగంగా అన్నదమ్ముల పిల్లలిద్దరిలో ఒక్కరికే టిక్కెట్ ఇస్తున్నారని సమాచారం.

వివరాళ్లోకి వెళ్తే... తాడిపత్రి, కళ్యాణదుర్గం టిక్కెట్లను జేసీ బ్రదర్స్ కోరుకుంటున్నట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి.. మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కొడుకు జేసీ వపన్ రెడ్డికి కల్యాణదుర్గం టికెట్ ఆశిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చంద్రబాబు వద్ద ఈ ప్రస్థావన తెచ్చారని అంటున్నారు. అయితే వీరిలో ఒక్కరికే బాబు టిక్కెట్ విషయంలో హామీ ఇచ్చారని తెలుస్తుంది.

వాస్తవానికి గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పవన్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా అస్మిత్ రెడ్డి పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే... ఓడిపోయినప్పటికీ తండ్రి ప్రభాకరరెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా ఉండటంతోనో ఏమో కానీ... తాడిపత్రి మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు అస్మిత్ రెడ్డి. ఇదే సమయంలో అనంతపురంలో ఓడిపోయిన పవన్ రెడ్డి మాత్రం నియోజకవర్గాలు మారుస్తూ అస్థిరత్వం ప్రదర్శించారని అంటుంటారు.

దీంతో పరిస్థితులను అంచనా వేశారో ఏమో కానీ... జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డికి చంద్రబాబు.. తాడిపత్రి టికెట్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తుంది. ఈ మేరకు జేసీ బ్రదర్స్ తో చాలాసేపు భేటీ అయిన చంద్రబాబు... ఈ సందర్భంగానే తాడపత్రి టికెట్ అస్మిత్ రెడ్డికి ఓకే చేశారని అంటున్నారు. ఇదే సమయంలో వపన్ రెడ్డికి కల్యాణదుర్గం టికెట్ ను ఇవ్వడం కుదరదని సూటిగా చెప్పినట్లు తెలుస్తుంది!


Tags:    

Similar News