బాబు పక్కన పవన్ ఫోటో...ఫ్యాక్ట్ ఇదే !?
పవన్ కి కూటమి ప్రభుత్వంలో అన్ని రకాలైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉంటే ఉప ముఖ్యమంత్రిగా అత్యంత కీలకమైన బాధ్యతలతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కి కూటమి ప్రభుత్వంలో అన్ని రకాలైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి.
ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ కి ప్రోటోకాల్ వంటివి దక్కుతున్నప్పటికీ తాజాగా జరుగుతున్న ఒక ప్రచారంలో మాత్రం వాస్తవం ఎంత అన్నది అంతా ఆరా తీస్తున్నారు. అదేంటి అంటే ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రి ఫోటో కచ్చితంగా ఉంటుంది. ఇది నిబంధనల ప్రకారం ఉండి తీరాల్సిందే.
అయితే పవన్ ఫోటో కూడా పెడుతున్నారు అన్న చర్చ అయితే ఇపుడు సాగుతోంది. దాని మీద విపరీతమైన ప్రచారం కూడా ఒక వైపు సాగుతోంది. అపుడే సోషల్ మీడియాలో చంద్రబాబు పక్కన పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్లుగా ఇమేజ్ లను సైతం క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు.
దీంతో ఇదంతా నిజమేనా అన్న డిస్కషన్ అయితే సాగుతోంది. అయితే దీని మీద మేధావులు రాజ్యాంగ నిపుణులు చెప్పేది ఏంటి అంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని లీడ్ చేసేది సీఎం తప్ప మరొకరు కాదు. అందువల్ల ఆయన ఫోటోనే ప్రభుత్వ కార్యాలయాలలో పెడతారు అని.
అదే విధంగా చూస్తే కనుక ప్రభుత్వ ఆఫీసులలో కేవలం సీఎం ఫోటో మాత్రమే పెట్టాలన్నది నిబంధనగా ఉంది అని అంటున్నారు. సీఎం ఫోటో పక్కన మరే ఫోటో పెట్టడం కానీ షేర్ చేసుకోవడం ఉండదని స్పష్టం చేస్తున్నారు. చట్టం అయితే ఆ విధంగా చెబుతోంది అని అంటున్నారు.
అలా కాకుండా రాజకీయ పార్టీలు సొంత నిర్ణయాలు తీసుకోలేవు అని అంటున్నారు. అయితే అతి ఉత్సాహవంతులు అభిమానులు ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు తప్ప వాస్తవంలో అయితే ప్రభుత్వ ఆఫీసుల్లో ముఖ్యమంత్రి ఫోటో మాత్రమే ఉంటుందని అదే రూల్ అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే మ్యాటర్ ఇంత క్లియర్ గా ఉందని అంటున్నారు. మరి దీని మీద ప్రచారం మాత్రం వేరే లెవెల్ లో ఉండడంతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన వారు అంతా అలా జరిగేందుకు వీలు లేదు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కి ఎంతో విలువ ఉంది. అందులో రెండవ మాటకు తావు లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.