ప‌వ‌న్ ప్ర‌స్తుతం.. 'రియ‌ల్' హీరో!

ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రీల్ హీరో. ప‌వర్ స్టార్‌. క్ష‌ణం తీరిక లేకుండా.. ఆయ‌న సినిమాల‌తో బిజీబిజీగానే గ‌డిపారు.

Update: 2024-06-23 23:30 GMT

ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రీల్ హీరో. ప‌వర్ స్టార్‌. క్ష‌ణం తీరిక లేకుండా.. ఆయ‌న సినిమాల‌తో బిజీబిజీగానే గ‌డిపారు. పైగా.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న బిజీగానే ఉన్నారు. అనేక సినిమాలు పెండింగులోనూ ఉన్నా యి. ఏచిన్న విరామం దొరికిగా.. ఇప్పుడు ఆయ‌న‌కు సినీ రంగం స్వాగ‌తం ప‌లుకుతున్న విష‌యం తెలిసిందే. కానీ, ప్ర‌స్తుతం ఆయ‌న రీల్ హీరో క‌న్నా.. రియ‌ల్ హీరోగా బిజీ అయిపోయారు. టీడీపీ కూట‌మి స‌ర్కారులో కీల‌క భాగ‌స్వామి కావ‌డం.. పైగా.. డిప్యూటీ సీఎం కావ‌డంతో ఆయ‌న బిజీ అయ్యారు.

పైగా జ‌న‌సేన పార్టీ పోటీ చేసిన 21 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం ద‌క్కించుకుంది. దీంతో ప‌వ‌న్ పూర్తిస్థా యిలో రాజ‌కీయాల‌కు స‌మ‌యం కేటాయించే ప‌రిస్థితి వ‌చ్చింది. పైగా.. మంత్రిగా నాలుగు శాఖ‌లు (పంచా య‌తీరాజ్‌-గ్రామీణాభివృద్ధి-అట‌వీ-సైన్స్ అండ్ టెక్నాల‌జీ) తీసుకున్నారు. దీంతో మంత్రిగా ఆయా శాఖ‌ల బ‌రువు బాధ్య‌త‌ల‌ను కూడా ప‌వ‌న్ చూడాల్సి ఉంటుంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సినిమాలపై దృష్టి పెట్టే స‌య‌మం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా నిర్మాత ఏఎం ర‌త్నం.. ప‌వ‌న్ ఎప్పుడు వ‌స్తాడా అంటూ ఎదురు చూస్తున్నారు. తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే.. ఆయ‌న‌కు కూడా ఎదురు చూపులు త‌ప్పేలా లేవు. వాస్త‌వానికి జూలై తొలి వారంలోనే ప‌వ‌న్ షూటింగుకు వ‌స్తున్నార‌న్న వార్త‌ల‌ను కూడా.. ర‌త్నం ఖండించారు. అదేమీ లేద‌న్నారు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాజ‌కీయ బాధ్య‌త‌ల్లో బిజీబిజీగా ఉన్నార‌ని ర‌త్నం తెలిపారు. ఆయ‌న‌కు ఉన్న స‌మ‌యాన్ని పూర్తిగా రాజ‌కీయాల‌కే అంకితం చేశార‌న్నారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చేయాల్సిన సినిమా షూటింగుల‌ను వాయిదా వేశారు. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో కొంత మేర‌కు ప‌వ‌న్ చేయాల్సి ఉంటుంది. దీనికి కేవ‌లం కొన్ని రోజులు మాత్ర‌మే ప‌ట్టే అవ‌కాశం ఉంది. అయితే.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ బిజీగా ఉండ‌డంతో షూటింగ్ ఆగింది.

Tags:    

Similar News