పవన్ కే సాధ్యం.. రీల్ వకీల్ సాబ్ సీన్ రియల్ గా

డిజిటల్ ప్రపంచం రాజ్యమేలుతున్న వేళ.. భావం ఏదైనా.. భావోద్వేగం మరేదైనా దాన్ని వీడియోతో పంచుకోవటం ఇప్పుడో అలవాటుగా మారింది.

Update: 2024-06-22 04:12 GMT

డిజిటల్ ప్రపంచం రాజ్యమేలుతున్న వేళ.. భావం ఏదైనా.. భావోద్వేగం మరేదైనా దాన్ని వీడియోతో పంచుకోవటం ఇప్పుడో అలవాటుగా మారింది. ఇలాంటి వేళలో.. ఒకే సమయంలో చూపించే రెండు వీడియోల్లోనూ ఒకే ప్రముఖుడు ఉండటం.. అది కూడా హీరోయిజం ప్రదర్శించే అరుదైన అవకాశం ఎవరికైనా ఉందంటే అది జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మాత్రమే ఉంటుందేమో. తెలుగు రాజకీయాల్లో మరే రాజకీయ అధినేత పడనన్ని అవమానాలు.. ఛీత్కారాలకు గురైనప్పటికీ ఏనాడు ఢీలా పడకుండా ఉన్న పవన్ కు కాలం.. ఈ రోజున చక్రవడ్డీతో సహా ఆయనకు ఎలాంటి గౌరవం.. మర్యాద దక్కాలో దక్కేలా చేస్తోందని చెప్పాలి.


పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ముగ్గురు బాధితురాళ్ల తరఫు పోరాడి గెలిచి.. వారి వాదనను.. వేదనను జడ్జికి అర్థమయ్యేలా చేసి.. వారికి న్యాయం జరిగేలా చేసి కోర్టు నుంచి తిరిగి వెళుతున్న వేళలో.. కోర్టుకు కావాలి కాసే మహిళా కానిస్టేబుల్ అర్థతతో షేక్ హ్యాండ్ ఇస్తూ తాను చెప్పాలనుకున్న మాటల్ని కళ్లతో చెప్పే సీన్ ఒకటి ఉంటుంది. రీల్ లో హీరో ఎలివేషన్ కోసం అలాంటి సీన్లు రాసుకుంటారు. తెర మీదా ఎఫెక్టివ్ గా చూపిస్తారు.

కానీ.. అలాంటి సీన్.. రియల్ గా చోటు చేసుకోవటం మాత్రం అరుదు. అదే సమయంలో రీల్ లో హీరోగా ఎలివేట్ అయ్యే వ్యక్తి.. రియల్ లోనూ అలాంటి తీరులో ఉండటం చాలా అరుదుగా చెప్పాలి. ఇలాంటి ఎన్నో అరుదైన ఘటనలు తనకు మామూలే అన్నట్లుగా వ్యవహరించటం ఆయన ఒద్దికకు నిదర్శనంగా చెప్పాలి. ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సభాపతి వద్దకు వెళ్లి ఆయనకు గౌరవంగా నమస్కారం చేసి.. తిరిగి వెళ్లే క్రమంలో స్పీకర్ కు గార్డుగా ఉండే వ్యక్తి.. వకీల్ సాబ్ సీన్ లో మాదిరి పవన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వటమే కాదు.. తనకు లభించిన అవకాశంగా తన చేతిలో గొప్పగా తన గుండెలకు దండం పెట్టుకునే వైనం చూసినప్పుడు ఇలాంటివి పవన్ కు మాత్రమే లభిస్తాయన్న భావన కలుగక మానదు. ఏమైనా.. రీల్ లోనూ రియల్ లోనూ ఒకేలాంటి హీరోయిజం చూపటం మాత్రం పవన్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో?

Tags:    

Similar News