బిగ్ బ్రేకింగ్ : బాలికకు వేధింపులు!.. మాజీ సీఎంపై పోక్సో కేసు!
అయితే, సాయం కోసం వెళ్లిన సమయంలో బాలికను యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన వయసు 81.. దక్షిణాదిన వారి పార్టీకి తొలి సీఎం.. నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేశారు.. బలమైన నాయకుడిగానూ పేరుంది.. అలాంటి ఆయన మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. లోక్ సభ ఎన్నికలు సమీస్తున్న సమయంలో ఇది ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది.
యడ్డి.. ఎందుకిలా..కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అంటే ఆ రాష్ట్రంలో చాలా పెద్ద నాయకుడు. ఎంతటి స్థాయి అంటే.. ఆయనను సీఎంగా తప్పించినందుకే గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది అనేంతగా. అలాంటి యడియూరప్ప తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. 17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఇంతకూ ఏం జరిగింది? తాము ఒకరి చేతిలో మోసపోయామంటూ ఓ మహిళ తన 17 ఏళ్ల కుమార్తెతో కలిసి ఫిబ్రవరి 2న యడియూరప్ప వద్దకు వెళ్లింది. అయితే, సాయం కోసం వెళ్లిన సమయంలో బాలికను యడియూరప్ప బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల మొదట్లో ఈ ఘటన జరగ్గా.. గురువారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత యడియూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వారికిది అలవాటే.. తప్పుడు ఫిర్యాదు యడియూరప్పపై తాజాగా ఫిర్యాదు చేసినవారికిది అలవాటైన పని అని.. ఇప్పటివరకు 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను యడియూరప్ప కార్యాలయం విడుదల చేసింది. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలపై యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు స్పందించలేదు.
కర్ణాటకలో కలకలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో బీజేపీకి చెందిన అగ్ర నాయకుడు యడియూరప్పపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు రావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతుండగా ఈ ఆరోపణలు రావడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. యడియూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పలుసార్లు వ్యవహరించారు. ఇప్పుడు ఆయన కుమారుడు విజయేంద్ర ఆ బాధ్యతల్లో ఉన్నారు.