గీతాంజలి మృతిపై పూనమ్ కౌర్ రియాక్షన్... తెరపైకి జల్సా సినిమా టాపిక్!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో గీతాంజలి అనే మహిళ మృతి తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-03-13 07:46 GMT

ఏపీలో జరుగుతున్న రాజకీయ, సామాజిక, సినిమా పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. తన అభిప్రాయాలను, విమర్శలనూ ఎప్పటికప్పుడు ఆన్ లైన్ వేదికగా చెబుతుంటారు హీరోయిన్ పూనమ్ కౌర్! ఈ క్రమంలో తాజాగా గీతాంజలి మృతిపైనా ఆమె ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లు చేస్తూ.. గీతాంజలికి న్యాయం చేయాలని, దీనికి కారకులైన వారిని శిక్షించాలని ఎక్స్ వేదికగా కోరారు పూనమ్!


అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో గీతాంజలి అనే మహిళ మృతి తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జగన్ సర్కార్ వల్ల ఆమె పొందిన లబ్ధి గురించి ఆమె చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో... ఆమెకు విపక్షాలకు సంబంధించిన వ్యక్తుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని.. అవి భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అధికారపార్టీ ఆరోపిస్తుంది.

ఈ సమయంలో ఆన్ లైన్ వేదికగా స్పందించిన పూనమ్ కౌర్... "గీతాంజలికి న్యాయం జరగాలి. ఆమె విషయంలో అసలేం జరిగింది? ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చింది? ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా ట్రోలర్స్ వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా? అమ్మాయిల మీద ఇలా రూమర్స్ పుట్టించి, మానసికంగా వేధించడం కొందరికి బాగా అలవాటైపోయింది. దయచేసి వారికి కఠినంగా శిక్షించండి. ఆ పసిపిల్లలు (గీతాంజలి బిడ్డలు)కు న్యాయం చేయండి అని ట్వీట్ చేశారు.

ఆ వెంటనే మరోసారి స్పందించిన పూనమ్... "నాకు వ్యతిరేకంగా జల్సా రూమర్స్ ని తెరపైకి తెచ్చారు. అసలు నిజాన్ని ఎవరూ నమ్మకుండా ఉండేందుకు రూమర్లు క్రియేట్ చేశారు. నేను ఏనాడు డైరెక్టర్ ని కానీ, ఏ హీరోని కానీ అవకాశం ఇవ్వమని అడగలేదు. నేను చేసిన సినిమాలకంటే వదులేసిన సినిమాలే ఎక్కువ. దయచేసి ఆ రూమర్లను నమ్మకండి" అని ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. కాగా... జల్సా సినిమాలో పూనమ్ నటించాల్సి ఉందని.. కాకపోతే చివరి నిమిషంలో పార్వతీ మెల్టన్ ను తీసుకొచ్చారని.. అలా మొదలైన గొడలు ఇంకా ఉన్నాయని రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదంతా అసత్యమని.. ‘అసలు నిజాన్ని’ ఎవరూ నమ్మకుండా ఉండేందుకు క్రియేట్ చేశారని.. అది కొంతమందికి అలావాటే అంటూ ఆమె తాజాగా స్పందించారు.

Tags:    

Similar News