రాత్రి 9 తర్వాత పవన్ నుంచి ఫోన్... గట్టిగా ఇచ్చిపడేశానంటున్న పోసాని!
ఈ క్రమంలో తాజాగా గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ రోజుల్లో పవన్ కల్యాణ్ తో జరిగిన ఒక విషయాన్ని వెల్లడించారు పోసాని కృష్ణమురళి! ఈ సందర్భంగా.. పవన్ ని వాయించి వదిలినట్లు తెలిపారు.
ఏపీలో రాజకీయ వాతావరణం ఏ స్థాయిలో వేడెక్కిందనేది తెలిసిన విషయమే. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో పాటు పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ అయిపోవడంతో ప్రచార కార్యక్రమాలతో పాటు ప్రత్యర్థులపై విమర్శలు ప్రతి విమర్శల దాడులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో న్యూస్ ఛానల్స్ లో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కీలక నేతలు. ఈ క్రమంలో పవన్ తో జరిగిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు పోసాని.
అవును.. ఏపీ రాజకీయాల్లో పవన్, చంద్రబాబు, లోకేష్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే వైసీపీ నేతల్లో, ఆ పార్టీ అభిమానుల్లో పోసాని కృష్ణమురళి ఒకరనే సంగతి తెలిసిందే. పైగా ఇటీవల కాలంలో ఆయన రాజకీయ విమర్శల డోసు మరింత పెరిగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ రోజుల్లో పవన్ కల్యాణ్ తో జరిగిన ఒక విషయాన్ని వెల్లడించారు పోసాని కృష్ణమురళి! ఈ సందర్భంగా.. పవన్ ని వాయించి వదిలినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా.. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కోసం కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టై ఇచ్చినట్లు చెప్పిన పోసాని... అప్పటికీ పవన్ కల్యాణ్ లొకేషన్ కి రాకపోయేసరికి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపారు. అనంతరం తను ఇంటికెళ్లి భోజనం చేస్తుండుగా పవన్ కల్యాణ్ ఫోన్ చేశాడని అన్నారు. ఈ సమయంలో... "చెప్పు పవన్" అని అంటే... "మేం పిచ్చోళ్లమా... షూటింగ్ సమయంలో మీరు ఉండాలి కదా" అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అని అన్నారు.
అయితే తాను విషయం వివరించే ప్రయత్నంలో భాగంగా... "నా భార్యకు ఆపరేషన్ అయింది.. ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పాను.. అందుకే ఇంటికి వచ్చాను.. రేపు మాట్లాడుకుందాం.." అని చెబుతూ... "నువ్వు హీరో అయితే ఏంటి..?" అని గట్టిగా రియాక్ట్ అయినట్లు పోసాని కృష్ణ మురళి చెప్పారు. ఈ క్రమంలో... సాధారణంగా తాను మూవీ షూటింగ్ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తానని చెప్పారు.
అయితే... ఆ సినిమా దర్శకుడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తే.. రాత్రి 9 గంటల వరకు ఉంటానని చెప్పానని.. తనకు ఎక్కువ చేస్తే కుదరని.. తనతో పొగరుగా మాట్లాడితే కుదరని చెప్పారు. ఇదే క్రమంలో... పవన్ కల్యాణ్ ను రాజకీయం పరంగా వ్యతిరేకిస్తే తనకు సినిమాలు ఏమీ పోలేదని చెప్పిన ఆయన... తెలుగు పరిశ్రమ మొత్తం మెగా ఫ్యామిలీ ఉంటే మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ బాబు ఎందుకు గెలిచాడని పోసాని సూటిగా ప్రశ్నించారు.
అదేవిధంగా... మెగా ఫ్యామిలీ పవర్ ఉన్న వారు అయితే చిరంజీవి రాజకీయాల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ నుంచి బూతు మెసేజ్ లు వచ్చేవని.. అది చాలా ఘోరమని తెలిపిన పోసాని.. తనకు సినిమాలో అవకాశాలు రాకుండా చేస్తే వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.