పుణె కారు ఘటనలో కొత్త ట్విస్టు... సినిమా స్క్రిప్ట్ దిగదుడుపే!?

అవును... పుణెలో టీనేజర్ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో పలు ట్విస్టులు, మరెన్నో జలక్కులు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-05-30 09:49 GMT

మహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో రకరకాల ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా స్క్రిప్ట్ స్థాయిలో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. నిందితుడి స్థానంలో డ్రైవర్ ని ఏర్పాటు చేసే ప్రయత్నం నుంచి బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ మార్చడం వరకూ పలు ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి.

అవును... పుణెలో టీనేజర్ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో పలు ట్విస్టులు, మరెన్నో జలక్కులు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ చేస్తున్నది ఆ మైనర్ కాదని.. తమ ఫ్యామిలి డ్రైవర్ అని తప్పుదోవ పట్టించే విషయం తరపైకి రావడం.. ఇందులో ప్రధాన నిందితుడి తాతను అరెస్ట్ చేయడం తెలిసిందే.

ఈ సమయంలో నిందితుడి బ్లడ్ శాంపుల్స్ ప్లేస్ లో మరొకరి బ్లడ్ శాంపుల్స్ ని పరీక్షకు పంపారనే విషయం తెరపైకి వచ్చింది. ప్రధాన నిందితుడైన మైనర్ బ్లడ్ టెస్ట్ నివేదికను వైద్యులు మార్చేసినట్లు ఇదివరకు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే... ఆ బ్లడ్ ను తన తల్లి బ్లడ్ శాంపుల్స్ తో మార్చివేసినట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి.

ఈ విషయంలో... డాక్టర్ శ్రీహరి హల్నోర్‌ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. దీంతో... ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనిపై వేటుపడింది. సాసూన్‌ జనరల్‌ ఆస్పత్రి అతడిని విధుల నుంచి తొలగించింది. ఇదే సమయంలో... అతడిని సర్వీసు నుంచి పూర్తిగా డిస్మిస్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రీసెర్చి ఆఫ్‌ మహారాష్ట్ర ప్రకటించింది.

ఇప్పటికే ఈ కేసులో ఉన్న ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్డే పైనా సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. శ్రీహరి హల్నోర్‌, తావ్డేతో పాటు ఒక గుమస్తాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. బ్లడ్‌ టెస్ట్ జరిగిన సమయంలో నిందితుడి తల్లి ఆసుపత్రిలో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెకోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News