కేబినెట్ కూర్పులో క్లిష్ట ప్రశ్నలు... కులాలవారిగా లిస్ట్ ఇదే
ఈ సమయంలో రేవంత్ కేబినెట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న కూర్పు ఈ విధంగా ఉండొచ్చని తెలుస్తుంది.
రేవంత్ రెడ్డి సీఎంగా మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణంలో... సామాజివర్గాల వారీగా కేబినెట్ కూర్పు అత్యంత కీలకంగా మారబోతుందనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సమాజికవర్గాల్లో.. వారిలో ఎంతమందికి కేబినెట్ పోస్ట్లు ఇవ్వగలరు మొదలైన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో రేవంత్ కేబినెట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న కూర్పు ఈ విధంగా ఉండొచ్చని తెలుస్తుంది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉండొచ్చని తెలుస్తుంది. ఇందులో ఎస్సీల నుంచి భట్టి విక్రమార్క, బీసీల నుంచి పొన్నం ప్రభాకర్, ఎస్టీలనుంచి సీతక్క పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్ మోస్ట్ ఇవే ఫైనల్ అయ్యే అవకాశలు పుష్కలంగా ఉన్నాయి. ఇక అతిపెద్ద సమస్యగా భావిస్తున్నారని చెబుతున్న మంత్రివర్గ కూర్పులో ప్రధానంగా సామాజికవర్గాలే కీలకం కాబోతున్నాయని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేల నుంచి ముగ్గురికి, బీసీల నుంచి నలుగురికి కేబెనెట్ లో అవకాశం ఉండబోతుందని అంటున్నారు. ఇదే సమయంలో... ఎస్టీ, వెలమ, కమ్మ, బ్రాహ్మణ కోటాలో ఒక్కొక్కరికి చోటుదక్కే ఛాన్స్ కనిపిస్తుందని చెబుతున్నారు. మరోవైపు రెడ్లకు ఎన్ని బెర్తులు కన్ ఫాం చేస్తారనే విషయంపైనా ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో మైనారిటీల నుంచి ఒకరికి అవకాశం ఇచ్చిన అనంతరం... ఈ దఫా గెలిచిన 25మంది రెడ్లు మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.
ఈ కేబినెట్ రేసులో ఎస్సీ సామాజికవర్గం నుంచి భట్టి విక్రమార్క (మాల), దామోదర్ రాజనర్సింహం (మాదిగ), గడ్డం వివేక్ (మాల), గడ్డం వినోద్ (మాల), వంశీకృష్ణ (మాల) ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా... వీరితో పాటు ఎమ్మెల్సీ కోటాలో రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన అద్దంకి దయాకర్ (మాల) పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
బీసీల నుంచి పొన్నం ప్రభాకర్ (గౌడ), వాకిటీ శ్రీహరి (ముదిరాజ్), బీర్ల ఐలయ్య (కుర్మ), ఆది శ్రీనివాస్ (మున్నూరు కాపు), కొండా సురేఖ (పద్మశాలి), ఈర్లపల్లి శంకర్ (రజక) ల పేర్లు వినిపిస్తుండగా... వీరిలో నలుగురికి ఛాన్స్ ఉండొచ్చని తెలుస్తుంది.
ఇదే సమయంలో ఎస్టీ కోటాలో ప్రధానంగా సీతక్క (కోయ) పేరు వినిపిస్తుండగా... కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వర రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా... వెలమ కోటాలో ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... ప్రేం సాగర్ రావు, జూపల్లి కృష్ణారావు, గండ్ర సత్యన్నారాయణ లు కేబినెట్ పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో ఒక్కరు మాత్రమే అమాత్యులు కాగలారని సమాచారం!
ఇక బ్రాహ్మణ కోటాలో మంథని నుంచి గెలిచిన శ్రీధర్ బాబు పేరు వినిపిస్తుండగా... ఇక రెడ్డి కోటాలో చాలా పేర్లే వినిపిస్తున్నాయి! ఇక్కడే పోటీ ఎక్కువగా ఉంది. ఇందులో బలంగా వినిపిస్తున్న పేర్లు... కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, దొంతి మాదవ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, పి. సుదర్శన్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈ భారీ లిస్ట్ లో ఎవరెవరికి కేబినెట్ లో బెర్త్ దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ, రెడ్డి సామాజికవర్గాల్లో పోటీ గట్టిగా ఉందని అంటున్నారు.