అప్రూవర్ గా మారుతున్న మాగుంట తనయుడు....?
నిజానికి చాలా కీలకమైన కేసులు ముఖ్య కేసుల లో బయటపడాలీ అంటే అప్రూవర్ గా మారడం ఉత్తమమైన మార్గం.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరుక్కుని చాలా నెలల పాటు జైలు జీవితం గడిపిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఇపుడు బెయిల్ మీద బయట కు వచ్చారు. అయితే ఆయన అప్రూవర్ గా మారుతారా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. నిజానికి చాలా కీలకమైన కేసులు ముఖ్య కేసుల లో బయటపడాలీ అంటే అప్రూవర్ గా మారడం ఉత్తమమైన మార్గం.
అది న్యాయపరంగా కూడా చెల్లే మార్గం. అంతే కాదు జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి కోర్టుల నుంచి క్షమా బిక్ష అందుకోవడానికి అదే మార్గం. ఆ విధంగా చూసుకుంటే చాలా సంచలనం రేకెత్తించే కేసుల లో ఇలాగే జరుగుతోంది. ఏకంగా కత్తి పట్టుకుని మర్డర్ చేసిన వారు కూడా అప్రూవర్ గా మారిపోయి బయటపడుతున్న సంఘటనలు చూస్తున్నాం.
ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ స్కాం లో రెండు తెలుగు రాష్ట్రాల కు చెందిన ప్రముఖులు పెద్దలు చాలా మంది ఉన్నారు. అయితే ఇపుడు ఈ కేసు లో బెయిల్ మీద తాజాగా బయట కు వచ్చిన మాగుంట రాఘవ విషయం లో ఒక ప్రచారం సాగుతోంది.
ఆయన ఈ కేసు లో అప్రూవర్ గా మరుతారు అని ఢిల్లీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. ఢిల్లీ మధ్య పాలసీ కుంభకోణం లో ఇరుక్కుని గురువారం రాఘవ సాధారణ బెయిల్ కోసం ఢిల్లీలొని ప్రత్యేక కోర్టులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద అఫిడవిట్ సమర్పించారు. దీని మీద ప్రత్యెక కోర్టు ఆగస్ట్ 10న ఈ కేసుని విచారించనుంది.
ఇదిలా ఉంటే రాఘవ ఈ నెల 18న మధ్యంతర బెయిల్ మీద బయట కు వచ్చారు. ఆయన కు నాలుగు వారాల బెయిల్ మాత్రమే కోర్టు మంజూరు చేసింది. అయితే రాఘవ బెయిల్ ని గతం లో తీవ్రంగా వ్యతిరేకించిన ఈడీ ఈసారి మాత్రం ఆయన సాధారణ బెయిల్ పిటిషన్ ని వ్యతిరేకించలేదని అంటున్నారు.
ఇక ఈ కేసు లో రాఘవ అప్రూవర్ గా మారిన తరువాతనే మధ్యంతర బెయిల్ ఇచ్చారని అంటున్నారు. అది కూడా అరబిందో గ్రూప్ డైరెక్టర్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు అయుఇన ప్రి శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చిన యాభై రోజుల తరువాత రాఘవ కు బెయిల్ మంజూరు అయింది అని తెలుస్తోంది. ఇదే లిక్కర్ స్కాం కేసులో బీయారెస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె కల్వకుంట్ల కవిత మాజీ చార్టర్ అకౌంటెంట్ అయిన గోరంట్ల బుచ్చిబాబు కూడా అప్రూవర్ గా మారి బెయిల్ పొందారని తెలుస్తోంది.
ఇదే కేసు లో అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, జి బుచ్చిబాబులతో పాటు తెలుగు రాష్ట్రాల లో ప్రముఖుడు అయిన మాగుంట రాఘవ పేరుని రిమాండ్ రిపోర్టులో పెట్టిన ఈడీ ఆ తరువాత కవిత పేరును కూడా చేర్చింది. రాఘవ చెన్నై లోని ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన మద్యం తయారీ యూనిట్ల యజమానిగా ఉన్నారు.
అదే విధంగా అతను ఎక్సైజ్ పాలసీ 2021-22కి విరుద్ధంగా మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు రిటైల్ జోన్‌ల ను నిర్వహిస్తున్నారు మరో వైపు చూస్తే రాఘవ తన ప్రాక్సీ ప్రేమ్ రాహుల్ మండూరి ద్వారా ఎల్1 హోల్‌సేల్ లైసెన్స్ ఉన్న ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం వాటాను కూడా కలిగి ఉన్నారని అదే విధంగా రాఘవ ఆప్ నేతలకు ఈ స్కాం కి సంబంధించి వంద కోట్లు చెల్లించారని ఈడీ భారీ అభియోగాల ను మోపింది. వీటి సంగతి పక్కన పెడితే రాఘవ ఇపుడు అప్రూవర్ గా మారుతారా అన్నదే చర్చకు వస్తోంది.