రేవంత్ వివక్ష అంటే ఇదీ .. రఘునందన్ ఫైర్ !

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు రూపాయి ఇవ్వకుండా కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వం వివక్ష చూపిందని రేవంత్ విమర్శించారు

Update: 2024-07-26 02:45 GMT

‘’ రేవంత్ వివక్ష అంటే ఇది. నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కు రూ.4369 కోట్లు కేటాయించుకుని రాష్ట్రంలో మిగిలిన 118 నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిన నువ్వు సమానత్వం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గాడిద గుడ్డు ముచ్చట్లు కాదు’’ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు రూపాయి ఇవ్వకుండా కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వం వివక్ష చూపిందని రేవంత్ విమర్శించారు. శాసనసభలో కేంద్రం తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు కొడంగల్ నియోజకవర్గానికి ఏకపక్షంగా రూ.4369 కేటాయించుకోవడాన్ని తప్పుపట్టారు.

ఇక కేంద్రప్రభుత్వం తెలంగాణకు రూపాయి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ‘’కేంద్రప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు’’ అంటూ గాడిద, గుడ్డుతో కూడిన ఫ్లెక్సీలను పెట్టడం గమనార్హం. మరి రఘునందన్ రావు విమర్శలపై రేవంత్ ఎలా స్పందిస్తాడో వేచిచూడాలి.

Tags:    

Similar News