ఆర్జీవీ సీరియస్ రీసెర్చ్... చంద్రబాబుకు '23' కి ఉన్నకనెక్షన్ పీక్స్!
అవును... చంద్రబాబుని తనదైన శైలిలో సెటైరికల్ గా విమర్శించడ్దంలో వైసీపీ నేతలకు ఏమాత్రం తగ్గరు ఆర్జీవీ అనే కామెంట్లు వినిపిస్తుంటాయి
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టైన అనంతరం రిమాండ్ కి పంపిన నేపథ్యంలో చంద్రబాబుకు... రాజమండ్రి సెంట్రల్ జైల్ అధికారులు 7691 నెంబర్ కేటాయించారు. ఈ నెంబర్ ని 7+6+9+1 అని కలుపుతున్న అర్జీవీ... టోటల్ 23 అని ట్విట్టర్ వేదికగా కొత్త చర్చకు తెరలేపారు. ఇదే సమయలో గతంలో 23 అనే నెంబర్ కు చంద్రబాబుకూ ఉన్న సంబంధంపై మరింత లోతైన రీసెర్చ్ చేసే పనిలో ఉన్నట్లున్నారు రాం గోపాల్ వర్మ్.
అవును... చంద్రబాబుని తనదైన శైలిలో సెటైరికల్ గా విమర్శించడ్దంలో వైసీపీ నేతలకు ఏమాత్రం తగ్గరు ఆర్జీవీ అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. తనదైన వెటకారాన్ని ప్రదర్శిస్తూ ఆయన చేసే ట్వీట్లు, చేసే పోస్టు, చెప్పే కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుంటాయి. అయితే అవి ప్రత్యర్థులకు మంట పుట్టిస్తుంటే... అనుచరులకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి.
ఈ క్రమంలో చంద్రబాబుకూ 23 నెంబర్ కూ ఉన్న సంబంధంపై ఆన్ లైన్ వేదికగా చర్చ వైరల్ గా సాగుతున్న సమయంలో మరోసారి కొత్త విశ్లేష్ణతో, సరికొత్త ఫార్ముళాతో తాజాగా స్పందించారు ఆర్జీవి. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఇరవై మూడో నెంబర్ తో ఉన్నది అత్యంత అవినాభావ సంబంధం అని తేల్చే ప్రయత్నం చేశారని తెలుస్తుంది.
తాజాగా ట్విట్టర్ లో స్పందించిన ఆర్జీవీ... "చంద్రబాబుకు 23 సీట్లు వచ్చాయి" అని మొదలుపెట్టారు. అనంతరం చంద్రబాబుకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇచ్చిన ఖైదీ నెంబర్ 7691 టోటల్ కూడా 23 అని అన్నారు. అనంతరం జగన్ ఖైదీ నెంబర్ ను కూడా ప్రస్థావించారు.
ఇందులో భాగంగా... గతంలో జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయన ఖైదీ నెంబర్ 6093 నుంచి బాబు ఖైదీ నెంబర్ 7691 ను తీసేస్తే వచ్చే సంఖ్య 1598. అంటే... 1+5+9+8 = 23. ఇదే సమయంలో చంద్రబాబుకి విధించిన 14 రోజుల రిమాండ్ పూర్తయేది ఈ నెల 23.. ఈ ఏడాది కూడా 2023 అంటూ వరుస వాయింపు మొదలుపెట్టారు ఆర్జీవీ!
అనంతరం, అసలు విషయం మరిచాను అన్నట్లుగా స్పందించిన ఆర్జీవీ... "నారా లోకేష్ పుట్టినరోజు జనవరి 23" అని ముగించారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతోపాటు... నిజంగా చంద్రబాబుకు - 23 నెంబర్ కు ఇంత అవినాభావ సంబంధం ఉందా అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైంది.