తరచూ టీ.. కాఫీలు తాగే అలవాటు ఉందా?

టీ.. కాఫీలు తాగే అలవాటుందా? తరచూ కూల్ డ్రింక్స్ కూడా తాగుతంటారా? అయితే.. షుగర్.. ఊబకాయానికి దగ్గరగా ఉన్నట్లేనని చెప్పాలి.;

Update: 2025-03-21 04:01 GMT
తరచూ టీ.. కాఫీలు తాగే అలవాటు ఉందా?

టీ.. కాఫీలు తాగే అలవాటుందా? తరచూ కూల్ డ్రింక్స్ కూడా తాగుతంటారా? అయితే.. షుగర్.. ఊబకాయానికి దగ్గరగా ఉన్నట్లేనని చెప్పాలి. హైదరాబాద్ లోని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిశోధకులు తాజాగా పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. టీ.. కాఫీ.. శీతలపానీయాలతో జరిగే నష్టం ఎంత? అన్న అంశంపై రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు చేపట్టిన పరిశోధనల వివరాలు ఆసక్తికరంగా మారాయి.

తాము రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రొఫెసర్లు ఉల్లాస్ ఎస. కొల్తూర.. మహేందర్ లు మరిన్ని అంశాల్న ప్రస్తావిస్తున్నారు. తాము పలు ప్రయోగాలు చేశామని.. వేర్వేరు జాతుల ఎలుకల్ని తీసుకొని.. కొన్నింటికి రోజుకు నాలుగైదు సార్లు చక్కెరతో కలిపిన వంద మిల్లీలీటర్ల టీ.. కాఫీ.. శీతలపానీయాల్ని ఇచ్చారు. మరికొన్ని ఎలుకలకు ప్రతి మూడు.. నాలుగు గంటలకు ఒకసారి ఇచ్చారు.

కొద్ది రోజుల అనంతరం వీటి రక్త నమూనాల్ని పరిక్షించగా అన్ని ఎలుకల్లోనూ మధుమేహం.. ఊబకాయ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు. ఈ ప్రయోగ ఫలితాల్ని అమెరికాలోని నేషణల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసిన గ్లోబల్ డైటరీ డేటాబేస్ తో సరిపోల్చారు. తమ పరిశోధన పత్రాన్ని ఇటీవల న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీలోనూ పబ్లిష్ అయినట్లుగా పేర్కొన్నారు.

టీ.. కాఫీ.. కూల్ డ్రింక్స్ లో ఉండే సుక్రోజ్ కారణంగా కాలేయం.. కండరాలు.. చిన్నపేగుల మీద తీవ్ర ప్రభావం పడుతున్న విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో కాఫీ.. టీలను సేవించే వారు వీలైనంతగా అందులో షుగర్ లేకుండా వాటిని తీసుకోవటం మంచిదన్న సూచన చేస్తున్నారు. సో.. ఇంకెందుకు ఆలస్యం.. కాఫీ.. టీ.. తాగే వేళలో షుగర్ లేకుండా ట్రై చేయండి.

Tags:    

Similar News