అల్లు అర్జున్ కోసం ఆర్జీవీ ఆన్ లైన్ పోరాటం.. తెర పైకి శ్రీదేవి టాపిక్!

‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని నటీనటులందరినీ కోరారు ఆర్జీవీ.

Update: 2024-12-20 04:10 GMT

‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విషయంలో.. అరెస్టై, ఒక రోజు జైల్లో ఉండి విడుదలైన అల్లు అర్జున్ ను తన నివాసంలో చాలా మంది ప్రముఖులు పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులూ ఉన్నారు.

అయితే.. ఈ విషయంపై ఆఫ్ ద రికార్డ్ తప్ప.. మైకుల ముందు, బహిరంగంగానూ, ఆన్ లైన్ వేదికగానూ అల్లు అర్జున్ తరుపున మాట్లాడుతున్న సినీ ప్రముఖులు ఆల్ మోస్ట్ లేరనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఈ క్రమంలో... అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మొదటి నుంచి ఆన్ లైన్ వేదికగా, అటు మీడియాలోనూ తన వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు ఆర్జీవీ.

అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇప్పటివరకూ రాజకీయ నాయకులు మాత్రమే పార్టీల వారీగా విడిపోయి స్పందిస్తున్నారు తప్ప.. సినీ నటుల స్పందన లేదని అంటున్న నేపథ్యంలో... అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇప్పటికే పలుమార్పు స్పందించిన ఆర్జీవీ... ఈసారి శ్రీదేవిని ఉదాహరణగా చెబుతూ మరోసారి ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

అవును... ‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని నటీనటులందరినీ కోరారు ఆర్జీవీ. ఈ సందర్భంగా క్షణ క్షణం సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ విషాద ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా... తెలంగాణ పోలీసులకు ఓ ప్రశ్న సంధించారు.

"అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రతీ స్టార్ నిరసన వ్యక్తం చేయాలి. ఏ సెలబ్రెటీ అయినా అది ఫిల్మ్ స్టార్ అయినా, పొలిటికల్ స్టార్ అయినా.. వారు గొప్పగా పాపులర్ అవ్వడం నేరమా?.. ‘క్షణ క్షణం’ షూటింగ్ లో శ్రీదేవి చూడటానికి వచ్చిన లక్షలాది మంది జనంలో ముగ్గురు చనిపోయారు. అందుకు తెలంగాణ పోలీసులు ఇప్పుడు శ్రీదేవిని అరెస్ట్ చేయడానికి స్వర్గానికి వెళ్తారా?" అని ఆర్జీవీ ఎక్స్ వేదికగా స్పందించారు.

కాగా.. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ చంచల్ గూడ జైల్ లో ఒక రాత్రి గడిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలుత నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన అనంతరం.. అదే రోజు, తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మధ్యంతర బెయిల్ విషయంలో తెలంగాణ పోలీస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటూ కథనాలొస్తున్నాయి.

Tags:    

Similar News