ఒకే విమానంలో చంద్రబాబు.. ఆర్కే రోజా.. తర్వాతేమైందంటే?
టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తిరుపతి నుంచి బయలుదేరిన ఆయన ఇండిగో విమానంలో గన్నవరానికి చేరుకున్నారు.
ఒకే రోజు ఒకే ఫ్లైట్ లో తెలుగుదేశం పార్టీ అధినేత కమ్ ఎపీ విపక్ష నేత చంద్రబాబు.. ఏపీ మంత్రి ఆర్కే రోజా ఒకే విమానంలో ప్రయాణించటం ఒక ఎత్తు అయితే.. ఆమె ఫ్లైట్ దిగిన ఎయిర్ పోర్టులోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో గన్నవరం రావటం.. వీరి విమానాలు ఒకే టైంలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ప్రత్యర్థి పార్టీల అధినేతలు ఒకే రోజు ఒకే ఎయిర్ పోర్టులో ఉండటం ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో మంత్రి ఆర్కే రోజా ఉండటం ఆసక్తికరంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తిరుపతి నుంచి బయలుదేరిన ఆయన ఇండిగో విమానంలో గన్నవరానికి చేరుకున్నారు.ఆయనకు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు టీడీపీ అభిమానులు.. క్యాడర్ పెద్ద ఎత్తున చేరుకొని.. స్వాగతం పలికారు. అయితే.. ఇదే విమానంలో మంత్రి ఆర్కే రోజా కూడా ఉండటం గమనార్హం.
ఎయిర్ పోర్టులో విమానం దిగిన అనంతరం.. భద్రతా సిబ్బంది ఆమెను ప్రత్యేక సెరెమోనియల్ లాంజ్ ద్వారా బయటకు పంపారు. ఈ మధ్యన విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆమె చేరుకున్న వేళ.. అదే రోజు ఎయిర పోర్టుకు పవన్ కల్యాణ్ వస్తుండటం.. ఆ సందర్భంగా జనసైనికులు పెద్ద ఎత్తునఎయిర్ పోర్టు వద్ద ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ఇలాంటి సీన్ గన్నవరంలోరిపీట్ కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. తిరుపతి నుంచి గన్నవరానికి వచ్చిన ఇండిగో ఫ్లైట్ రావటానికి కాస్త ముందుగా.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో మంగళగికి వెళ్లారు. ఇదే సమయంలో మంత్రి రోజా ప్రయాణించిన ఫ్లైట్ కూడా గన్నవరంలో ల్యాండ్ అయ్యింది. ఇంచుమించు ఇరువురు ముఖ్యనేతలు.. వేర్వేరు రూట్లలో ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లారు. మొత్తంగా.. ఒకే రోజున ఒకే ఎయిర్ పోర్టు నుంచి ఇంచుమించు ఒకే టైంలో ఇద్దరు విపక్ష పార్టీల అధినేతలు.. అధికారపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి ప్రయాణించటం ఆసక్తికరంగా మారింది.