చెవిలో పేలిన ఇయర్ బడ్స్... ఆ యువతి పరిస్థితి ఇదే!

ఇప్పుడు ఇయర్ బడ్స్ వాడటం అత్యంత కామన్ విషయంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-26 03:44 GMT

ఇప్పుడు ఇయర్ బడ్స్ వాడటం అత్యంత కామన్ విషయంగా మారిన సంగతి తెలిసిందే. అస్తమానం ఫోన్ చెవిలో పెట్టుకుని మాట్లాడనవసరం లేకుండా.. మాగ్జిమం స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇయర్ బడ్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఓ యువతి చెవిలో ఉండగా ఇయర్ బడ్స్ పేలిపోయాయి. ఈ ఘటన టర్కీలో జరిగింది.

అవును... టర్కీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఓ వినియోగదారుడు తన స్నేహితురాలి చెవిలో శాంసంగ్ గెలాక్సీ ఇయర్ బడ్స్ ఎఫ్.ఇ. పేలిపోయినట్లు తెలిపాడు. ఫలితంగా ఆమెకు శాశ్వత వినికిడి లోపం కలిగిందని పేర్కొన్నాడు. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారిన పరిస్థితి.

టర్కీష్ కమ్యునిటీ ఫోరంలో చేసిన పోస్ట్ ప్రకారం... అతడు ఇటీవల తన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రాతో జతచేయడానికి ఇయర్ బడ్ లను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో బాక్స్ లో ఇయర్ బడ్స్ తాజాగా ఉన్నాయి.. అప్పటికి 36 శాతం బ్యాటరీని కలిగి ఉన్నాయి. అయితే.. కొనుగోలు చేసినప్పటి నుంచీ ఒక్కసారి కూడా ఛార్జ్ కాలేదు.

ఈ సమయంలో... ఈ కొత్త ఇయర్ బడ్స్ ను అతని స్నేహితురాలు అతని నుంచి తీసుకుని ప్రయత్నించగా.. ఆ ప్రయత్నం కాస్తా విషాదకరంగా మారింది. అవి చెవిలో ఉండగానే అందులో ఒక ఇయర్ బడ్ పేలింది. నివేదికల ప్రకారం... ఆ ఇయర్ పేలడం వల్ల ఆమెకు శాశ్వత వినికిడి లోపం ఏర్పడింది.

ఈ సమయంలో ఇన్ వాయిస్ తో సహా అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్స్ తో పాటు పరికరం పేలుడుకు ముందు తర్వాత ఫోటోలు, ఆమె వినికిడిలోపాన్న్ని లింక్ చేసే మెడికల్ రిపోర్ట్ లను తీసుకుని సర్వీస్ సెంటర్ ను సంప్రదించినా... శాంసంగ్ నుంచి ఎలాటి సరైన స్పందన రాలేదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని తెలుస్తోంది.

Tags:    

Similar News