అమెజాన్‌ అడవుల్లో పురాతన నగరం... షాకింగ్ డిటైల్స్ చెప్పిన సైంటిస్ట్స్!

అవును... “మనం చూసిందే లోకం కాదు, మనకు తెలిసిందే జ్ఞానం కాదు” అని మనిషికి ప్రకృతి ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది.

Update: 2024-01-12 13:30 GMT

అమెజాన్ అడవులు.. చాలా మందికి ఏ మాత్రం పరిచయం అవసరం లేని అదో వన్య ప్రపంచం! టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ ఆ అడవుల గురించి మనిషికి తెలిసింది చాలా తక్కువని, తెలియాల్సింది కొండంత అని అంటుంటారు. మరికొందరైతే అదొక రహస్యాల నిధి అని చెబుతుంటారు! ఈ క్రమంలో తాజాగా మరో రహస్యం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు అక్కడ ఒక నాగరం ఉందని తేలింది!

అవును... “మనం చూసిందే లోకం కాదు, మనకు తెలిసిందే జ్ఞానం కాదు” అని మనిషికి ప్రకృతి ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటుంది. “మీరు చూడని ప్రపంచం, మీకు తెలియని జ్ఞానం ఎంతో” ఉందని చెప్పకనే చెబుతుంటుంది. ఇందులో భాగంగా తాజాగా అమెజాన్‌ అడవుల్లో ఒక ఊహించని విషయం కనిపించింది. అక్కడ ఒక అతి పురాతన నగరాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

వివరాళ్లోకి వెళ్తే... అమెజాన్‌ అడవుల్లో ఓ పురాతన నగరాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల కనిపెట్టారు. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్‌ లో దీనిని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతం 2000 సంవత్సరాల క్రితం అత్యంత రద్దీగా ఉండేదని, ఆ తర్వాత కాలంలో మరుగున పడిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఎన్నో వివరాలను తాజాగా ది జర్నల్ సైన్స్ ప్రచురించింది.

వాస్తవానికి ఇరవైఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో మట్టిదిబ్బలు, పూడుకుపోయిన రోడ్లను స్టీఫెన్‌ రోస్టైన్‌ అనే శాస్త్రవేత్త గుర్తించారు. 2015లో లేజర్‌ సాంకేతికతతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు. అయితే అక్కడ ఒక నగరమే ఉంటుందని వారు నాడు ఊహించలేదు. ఈ సమయంలో తాజాగా.. ఒకప్పుడు రోడ్లను కలుపుతూ ఇక్కడ జనావాసాల సముదాయం ఉన్నట్లు గుర్తించారు

ఇందులో భాగంగా క్రీ.పూ. 500 నుంచి క్రీ.శ. 300-600 వరకు ప్రజలు ఇక్కడ జీవించినట్లు భావిస్తున్నారు. లేజర్ సాంకేతికతతో పరిశీలించిన శాస్త్రవేత్తలకు ఇక్కడ సుమారు 6,000 ఇళ్లు, భవనాలు నిర్మించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ జనావాసాల చూట్టూ వ్యవసాయ క్షేత్రాలుండేవని అంటున్నారు.

ఇదే సమయంలో ఒక్క సుమారు 20 కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయని, అవి ఆల్ మోస్ట్ 33 అడుగుల వెడల్పుతో ఉన్నట్లు ఆధారాలున్నాయని చెబుతున్నారు. ఇక్కడ తెలుస్తున్న వివరాల ప్రకారం ఇక్కడ కనీసం 10,000 నుంచి 30,000 మంది నివసించేవారని ఆంటోనే డోరిసన్‌ అనే శాస్త్రవేత్త అంచనా వేస్తూ 1,000 ఏళ్ల క్రితం ఈ నగరం అదృశ్యమైనట్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News