ఆస్తులు లాక్కోవడం జగన్ కి అలవాటే... షర్మిల అల్టిమేట్ కామెంట్

కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల జగన్ సొదరి జగన్ నే ఎపుడూ టార్గెట్ గా చేసుకుంటూ వస్తున్నారు.

Update: 2024-12-04 13:33 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కి అన్నీ ఇపుడు ప్రతికూలంగానే మారుతున్నాయి. ఆయన బలమైన టీడీపీ కూటమిని ఏపీలో ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సహజంగా విపక్షం వైపు నుంచి మద్దతు ఉండాల్సింది పోయి ఆయన మీదనే వారూ విమర్శలు ఎక్కు పెడుతున్నారు. కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల జగన్ సొదరి జగన్ నే ఎపుడూ టార్గెట్ గా చేసుకుంటూ వస్తున్నారు.

ఆమె జగన్ ని రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వైసీపీ అయితే ఆమెను రాజకీయ నేతగా గుర్తినమని అంటోంది కానీ జనాల్లోకి ఆమె చేస్తున్న కామెంట్స్ వెళ్తున్నాయి. దాంతో షర్మిలతో ఎలా రాజకీయాన్ని చేయాలో వైసీపీకి అసలు అర్థం కావడం లేదు.

లేటెస్ట్ గా షర్మిల తన అన్న జగన్ మీద అల్టిమేట్ కామెంట్ చేశారు. అది హాట్ గానే కాదు హార్ష్ గానూ ఉంది. ఎక్కడ గుచ్చాలో అక్కడ గట్టిగానే గుచ్చేస్తోంది. ఆ విధంగా జగన్ కి షర్మిల వేస్తున్న కౌంటర్లు గుక్క తిప్పుకోనీయడం లేదు అని చెప్పాలి. తాజాగా ఆమె జగన్ కి ఆస్తులు లాక్కోవడం అలవాటే అని ఘాటైన వ్యాఖ్య చేసి ఇరుకున పెట్టేశారు.

ఈ ఆరోపణ ఆమె చేయడం లో చాలా టైమింగ్ తోనే వ్యవహరించారు అని అంటున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం గతంలో చేసిన కార్యక్రమాల మీద ఒక వైపు కూటమి సర్కార్ ఆరా తీసి విచారణకు ఆదేశిస్తోంది. ఈ సందర్భంగా కూటమి పెద్దలు జగన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు.

అదే టైం లో షర్మిల కూడా జగన్ కి ఆస్తులు లాక్కోవడం అలవాటు అంటూ చేసిన కామెంట్స్ వైసీపీ అధినాయకత్వాన్ని పూర్తిగా కార్నర్ చేశాయని అంటున్నారు. ఇందులో రాజకీయమూ ఉంది, వ్యక్తిగతమూ ఉందని అలా చాలా స్మార్ట్ గా జగన్ మీద షర్మిల కామెంట్స్ చేశారు అని అంటున్నారు. ఇంతకీ షర్మిల చేసిన కామెంట్స్ కి సందర్భం ఏంటి అంటే ఏపీలో ఏపీలో తవ్వి తీస్తే చాలా అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగాయని కూటమి పెద్దలు అంటున్న క్రమం అని గుర్తు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వానికి చెందిన ఓడ రేవులను జగన్ సీఎం గా ఉండగా అమ్మకానికి పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని షర్మిల ఆరోపించారు. 2021లో అదానీ గ్రూపునకు గంగవరం పోర్టుని విక్రయించడం అంటేనే వైసీపీ సర్కార్ చేసిన అధికార దుర్వినియోగం ఏంటి అన్నది తెలుస్తుంది అని ఆమె అన్నారు. ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు లాభాలు తెచ్చిపెట్టే గంగవరం పోర్టుని కేవలం 640 కోట్ల రూపాయలకు జగన్ సర్కార్ అమ్మేసిందని ఆమె విమర్శించారు.

అంతే కాదు కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను కూడా జగన్ ప్రభుత్వం దారుణంగా దుర్వినియోగం చేసిందని షర్మిల తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ఈ విధంగా జగన్ ప్రభుత్వం అధికారాన్ని పూర్తి స్థాయిలో దువినియోగం చేసింది అని ఆమె ఆరొపైంచారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించి బాధ్యులు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

ఇక ఆస్తులు లాక్కోవడం జగన్ కి అలవాటే అన్న ఆమె కామెంట్ మాత్రం వైరల్ అవుతోంది. షర్మిలకు జగన్ కి మధ్య ఆస్తుల వివాదం ఉందన్న సంగతి తెలిసిందే. తనకు దక్కాల్సిన ఆస్తులను జగన్ తీసుకున్నారు అన్నదే ఆమె ఆరోపణ అని అంటునారు. దానికి ఆమె రాజకీయ విమర్శలతో ముడిపెట్టి ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టారని అంటున్నారు. మరి దీనికి వైసీపీ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News