మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం... వీడియో వైరల్!

ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్ బీర్ ను దోషిగా తెల్చింది. దీంతో ఆయన స్వర్ణ దేవాలయంలో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-04 05:50 GMT

శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్ బీర్ ను దోషిగా తెల్చింది. దీంతో ఆయన స్వర్ణ దేవాలయంలో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయంలో సేవకుడిగా పని చేస్తున్నారు. ఈ మేరకు పాత్రలు, బూట్లు శుభం చేస్తున్నారు! చేసిన తప్పును అంగీకరిస్తున్నట్లు రాసి ఉన్న ఓ బోర్డును మెడలో వేసుకుని, చెతిలో ఈటెను ధరించి సేవాదార్ గా పని చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.

అవును... పంజాబ్ లోని అమృత్ సర్ లో తుపాకీ పేలిన చప్పుడు తీవ్ర కలకలం రేపింది. ఇందులో భాగంగా... ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదల్ పార్టీ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న సుఖ్ బీర్... స్వర్ణదేవాలయ ప్రవేశద్వారం వద్ద చక్రాల కుర్చీపై కూర్చొని కాపలాదారుడిగా ఉన్నారు. ఈ సమయంలో.. ఆయనను సమీపించిన ఓ వృద్ధుడు.. తన ప్యాంట్ జేబులోంచి తుపాకీ తీసి, కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న సుఖ్ బీర్ పై కాల్పులు జరిపాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు.

ఈ సమయంలో.. తుపాకీ గాల్లోకి పేలింది! అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది.. పోలీసులకు అప్పగించారు. అయితే... నిందితుడిని నారైన్ సింగ్ చౌరాగా గుర్తించగా.. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు కథనాలొస్తున్నాయి.

Tags:    

Similar News