మోడీ సారు చేతుల మీదుగా ఓపెన్ అయిన వీరుడి విగ్రహం కూలిపోయింది
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని మాల్వాన్ పరిధిలోని రాజ్ కోట్ కోటలో 35 అడుగుల భారీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
మరీ ఇంత అన్యాయమా? మోడీ లాంటి ప్రపంచ నాయకుడి చేతుల మీదుగా ఓపెన్ అయ్యే కట్టడం విషయంలో ఎంత కేర్ ఫుల్ గా ఉండాలి? కానీ.. అలాంటిదేమీ లేకుండా వ్యవహరించిన తీరునకు మోడీ ఇమేజ్ బర్ బాద్ అయ్యే దుస్థితి. దగ్గర దగ్గర ఎనిమిది నెలల క్రితమే అర్భాటంగా ఓపెన్ చేసిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలిపోయిన వైనం చూస్తే.. నోటి వెంట మాట రాని పరిస్థితి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే ప్రాజెక్టు విషయంలో అయినా నాణ్యతను పట్టించుకోరా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని మాల్వాన్ పరిధిలోని రాజ్ కోట్ కోటలో 35 అడుగుల భారీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని గత ఏడాది డిసెంబరు నాలుగున నేవీ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకంగా పిలిపించి మరీ.. ఆయన చేతలు మీదుగా ఈ భారీ విగ్రహాన్ని ప్రారంభింపచేశారు. అయితే.. తాజాగా ఈ విగ్రహం అనూహ్యంగా కుప్పకూలిపోయిన వైనం షాకింగ్ గా మారింది.
భారీ శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా హాజరయ్యారు. ఇంత ప్రతిష్ఠాత్మకంగా శివాజీ విగ్రహాన్ని ప్రారంభించిననేపథ్యంలో దాని నిర్మాణాన్ని.. నాణ్యతను తగిన విధంగా క్రాస్ చెక్ చేయాలసిన బాధ్యత చేసి ఉంటారు కదా? అలాంటప్పుడు ఇంత త్వరగా.. అకస్మాత్తుగా ఎలా కుప్పకూలింది? అన్నదిప్పుడు ప్రశ్న.
విగ్రహం కూల్చివేతకు సంబంధించి ఒక ఫన్నీ వాదనను అధికారులు వినిపిస్తున్నారు. ఇటీవల కాలంలో భారీ వర్షాలు..ఆదురు వానలు వీసతునన నేపథ్యంలో విగ్రహం కూల్చివేతకు ఇదో కారణంగా మారుతుందని చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన జరిగనంతనే.. విగ్రహం కూలిపోయిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు.. జిల్లా యంత్రాంగం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విగ్రహం కూలిపోయిన నేపథ్యంలో దీనికి బాధ్యులెవరన్నది తేల్చటం వారికి అతి పెద్ద కష్టంగా మారనుంది. మరేం జరుగుతుందో చూడాలి.