ఉత్త‌ర ముంబైలో 48 ఓట్ల‌తో శివ‌సేన విజ‌యం!

ఎన్నిక‌ల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పులు భిన్నంగా ఉంటాయి.

Update: 2024-06-05 09:14 GMT

ఎన్నిక‌ల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పులు భిన్నంగా ఉంటాయి. నాయ‌కులు ఆశ‌లు పెట్టుకు న్న దానికి.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ఎన్నిక‌లు అద్దంప‌డుతుంటాయి. ఇలానే ఇప్పుడు జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌లు తీర్పు చెప్పారు.. మ‌హారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ద‌వ్ ఠాక్రేను గ‌ద్దె దింపిన బీజేపీకి.. ప్ర‌జ‌లు అలాంటి పాఠ‌మే నేర్పించారు. ఉద్ధ‌వ్ ఠాక్రే పార్టీ శివ‌సేన‌ను బీజేపీతో చేతులు క‌లిపిన ఏక్‌నాథ్ షిండే లాగేసుకున్న విష‌యం తెలిసిందే.

ఆ త‌ర్వాత‌... ఈ పార్టీ చీలిపోయి.. శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త బాల ఠాక్రే కుమారుడు ఉద్ద‌వ్ విడిగా యూబీటీ శివ‌సేన‌ను స్థాపించుకున్నారు. తాజా ఎన్నిక‌ల‌లో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేనకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. ఉదాహ‌ర‌ణ‌కు నార్త్ ముంబై సీటులో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన విజ‌యం ద‌క్కించుకుంది. వాస్త‌వానికి ఇది యూబీటీ శివ‌సేనకు ద‌క్కుతుందని అంద‌రూ అంచ‌నాలు వేసుక‌న్నారు.

అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ నుంచి ఏక్‌నాథ్‌ శివ‌సేన త‌ర‌ఫున పోటీ చేసిన‌.. ర‌వీంద్ర వైక‌ర్ విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఆయ‌న మెజారిటీ కేవలం 48 ఓట్లు. ఇది కొత్త‌కాదు.. ఏపీ స‌హా అనేక రాష్ట్రాల్లో 2019లో కొంద‌రు 25 , 12 సీట్ల‌తోనూ గెలిచిన వారు ఉన్నారు. ఇక్క‌డ వైక‌ర్‌కు పోటీగా.. యూబీటీ శివ‌సేన అభ్య‌ర్థి అమోల్‌ కీర్తికార్ పోటీ చేశారు. వైక‌ర్‌కు 4,52,644 ఓట్లు రాగా.. కీర్తికార్‌కు 4,52,596 ఓట్లు ల‌బించాయి. ఇద్ద‌రి మ‌ధ్య కేవ‌లం 48 ఓట్లు మాత్ర‌మే తేడా కావ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఏక్‌నాథ్ శివ‌సేనను ప్ర‌జ‌లు ఆద‌రించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.


Tags:    

Similar News