రష్యా బలం వెనుకున్న దేశం అదేనా?
ఉత్తర కొరియా మీద ఐక్యరాజ్య సమితి ఆంక్షలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఆయుధాలకు ప్రతిగా ఇంధనాన్నే దిగుమతి చేసుకొని ఉండొచ్చన్నారు.
ఉత్తర కొరియా మీదా రష్యా మీదా సంచలన ఆరోపణ అస్త్రాన్ని సంధించింది సౌత్ కొరియా. ఉక్రెయిన్ - రష్యా మధ్య సాగుతున్న యుద్ధంలో ఆయుధ సాయం గురించిన కొత్త బాంబు పేల్చిన వైనం ఇప్పుడు సంచలనమైంది. ఉక్రెయిన్ కు అదే పనిగా దాడులకు వీలుగా రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధాల్ని సరఫరా చేస్తూ.. ఆ దేశానికి దన్నుగా నిలిచిన దేశం ఇదేనంటూ దక్షిణ కొరియా ఆరోపించింది. ఏడాది వ్యవధిలో దాదాపు 7 వేలకు పైగా కంటైనర్లు దక్షిణ కొరియా నుంచి రష్యాకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు.
కిమ్ సర్కారు మరోసారి పలు స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించినట్లుగా వార్తలు వచ్చిన వేళ.. దక్షిణ కొరియా రక్షణ మంత్రి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయుధాల్ని తరలించేందుకు తొలుత నౌకలను.. ప్రస్తుతం రైలు మార్గాలను వినియోగిస్తుందన్న ఆయన.. లక్షలాది శతఘ్ని గుండ్లు.. ఇతర యుద్ధ సామాగ్రి సరఫరాకు ప్రతిఫలంగా రష్యా నుంచి 9 వేల కంటెయినర్ల సాయం పొందినట్లుగా ఆరోపించారు.
ఉత్తర కొరియా మీద ఐక్యరాజ్య సమితి ఆంక్షలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఆయుధాలకు ప్రతిగా ఇంధనాన్నే దిగుమతి చేసుకొని ఉండొచ్చన్నారు. ఇంధన కొరతతో కొన్నేళ్లుగా తన సైనిక శిక్షణ కార్యక్రమాల్ని తగ్గించిందని.. తాజాగా మాత్రం ముమ్మరం చేయటాన్ని ప్రస్తావిస్తూ కొత్త అనుమానాన్ని వ్యక్తం చేసింది. నిజానికి ఈ తరహా ఆరోపణల్ని దక్షిణ కొరియా ఆరోపించగా.. ఉత్తర కొరియా.. రష్యాలు ఖండించాయి. ఏప్రిల్ 10న దక్షిణ కొరియా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాజా ఆరోపణలు తెర మీదకు రావటం ఆసక్తికరంగా మారింది.