ఆ విషయంలో ట్రంప్ ను సుందర్ పిచాయ్ అభినందించారా?

ఈ సమయంలో తాజాగా పిచాయ్ తనకు కాల్ చేశారని ట్రంప్ తెలిపారు.

Update: 2024-10-28 04:31 GMT

నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి ప్రచార కార్యక్రమాలు హోరా హోరీగా సాగుతున్నాయి. ఈ సమయంలో తనను సుందర్ పిచాయ్ అభినందించారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... తన ప్రచార ర్యాలీల సమయంలో తన ఆన్ లైన్ విజిబిలిటీని తగ్గించడానికి గూగుల్ తన సెర్చ్ ఫలితాలను వక్రీకరించిందని డొనాల్డ్ ట్రంప్ గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాను సుందర్ పిచాయ్ ని సంప్రదించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ సమయంలో తాజాగా పిచాయ్ తనకు కాల్ చేశారని ట్రంప్ తెలిపారు.

ఇందులో భాగంగా... గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మెక్ డొనాల్డ్స్ ను తాను ఇటీవల సందర్శించినందుకు మెచ్చుకోవడానికి తనకు ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. జో రోగన్ పోడ్ కాస్ట్ లో పాలొన్న సందర్భంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో... తాను మె క్ డొనాల్డ్స్ ని సందర్శించినప్పుడు పిచాయ్ కాల్ చేశారు అని అన్నారు. ఈ మెక్ డొనాల్డ్స్ విషయం మేము గూగుల్ కలిగి ఉన్న అతిపెద్ద అంశాల్లో ఒకటని.. ఇది ఇప్పుడు హిట్ చేసిందని పిచాయ్ తనతో అన్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు.

కాగా.. ట్రంప్ ఇటీవల కీలక రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలోని మెక్ డ్నాల్డ్స్ అవుట్ లెట్ ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన ఫ్రై కుక్ గా పనిచేసారు. తన ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కంటే 15 నిమిషాలు ఎక్కువ పనిచేసినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News