షర్మిళను ఎందుకు పక్కన పెట్టారంటే... సునీత కీలక వ్యాఖ్యలు!
అవును... ఒకప్పుడు వైసీపీలో కీలక భూమిక పోషించిన షర్మిళ.. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అన్నీ తానై అన్నట్లుగా నడిపించిన షర్మిళ.. అనంతర కాలంలో పార్టీకి ఎందుకు దూరయమ్మారనే విషయంపై సునీత స్పందించారు.
ప్రస్తుతం మిగిలిన నియోజకవర్గాల్లోని ఫైట్ ఒకెత్తు.. కడప లోక్ సభ పరిధిలోని పోరు మరొకెత్తు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. కడప లోక్ సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలు వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో... వైఎస్ కుటుంబానికే చెందిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో... ఈసారి కడపలో ఎన్నికలు మరొకెత్తు అని అంటున్నారు పరిశీలకులు.
ఈ సమయంలో కడప లోక్ సభ స్థానంలో అవినాష్ రెడ్డిని ఓడించడానికే తన ప్రయత్నమని సునీత స్పష్టంగా తెలిపారు! ఇదే సమయంలో... అవినాష్ కు టిక్కెట్ ఇవ్వడంతో తట్టుకోలేకే తాను కడప ఎంపీగా పోటీచేస్తున్నట్లు షర్మిళ ప్రకటించారు. దీంతో... షర్మిళకు తన పూర్తి మద్దతు ఉంటుందని సునీత వెల్లడించారు. ఈ సమయంలో... ఒకప్పుడు వైసీపీలో జగనన్న వదిలిన బాణం గా పిలుచుకునే వైఎస్ షర్మిళను అసలు ఎందుకు పక్కనపెట్టారంటే... అంటూ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ఒకప్పుడు వైసీపీలో కీలక భూమిక పోషించిన షర్మిళ.. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అన్నీ తానై అన్నట్లుగా నడిపించిన షర్మిళ.. అనంతర కాలంలో పార్టీకి ఎందుకు దూరయమ్మారనే విషయంపై సునీత స్పందించారు. ఇందులో భాగంగా... సీబీఐ కేసుల్లో జగన్ అరెస్టయి జైలులో ఉన్న సమయంలో షర్మిల పార్టీని భుజాన వేసుకుని నడిపించిందని సునీత గుర్తుచేశారు. అనంతరం జరిగిన పరిణామాలే షర్మిళను పార్టీ నుంచి దూరం పెట్టడానికి కారణం అని తెలిపారు.
ఇందులో భాగంగా... జగన్ వెంట కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో షర్మిళ తీవ్రంగా ప్రచరం చేసి గెలిపించారని చెప్పిన సునీత... ఆ ఎన్నికల్లో విజయం తర్వాత షర్మిళకు ఆదరణ వస్తోందనే కారణంతో పక్కనపెట్టారని తెలిపారు. అయితే... 2014 ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని అంతా భావించారని.. అయితే ఆ స్థానాన్ని అవినాష్ కు ఇవ్వాలని నిర్ణయించారని.. అది వివేకాకు ఇష్టం లేదని.. తర్వాత జరిగిన పరిణామాలే తన తండ్రిని బలి తీసుకున్నాయన్నట్లుగా సునీత వివరించారు!
మరోపక్క కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిళ... వివేకా కేసులో అవినాశ్ ను సీబీఐ నిందితుడిగా తేల్చిందని చెప్పారు. ఇదే సమయంలో... హత్య కేసులో నిందితుడిగా ఉన్నవారికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇస్తారని షర్మిళ ప్రశ్నించారు. చిన్నాన్న హత్య వ్యవహారంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు!