బీజేపీ తొలి జాబితా సిద్ధం... ఫస్ట్ 20 లిస్ట్ ఇదేనా!
ఇందులో భాగంగా... తొలివిడతలో కీలకమైన వ్యక్తులతో పాటు అసంతృప్తులను బుజ్జగించే రీతిలో టిక్కెట్ల కేటాయింపు ఉండేలా జాగ్రత్తలు పడుతుందని అంటున్నారు.
తెలంగాణాలో ఎన్నికల నోటిఫికేషన్ (నవంబర్ - 3)కి కౌంట్ డౌన్ ముంచుకొచ్చేస్తోంది. దీంతో ఇప్పటికే అధికార బీఆరెస్స్ దూకుడు పెంచింది. ప్రచారాలతో హోరెత్తించేస్తుంది. మ్యానిఫెస్టోను ప్రకటించేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తించేస్తుంది. తొలి జాబితా విడుదల చేసింది. మరోపక్క ఎవరూ ఊహించని రీతిలో బీఎస్పీ కూడా కీలకంగా మేనిఫెస్టొ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ కాస్త వెనుకబడిందనే కామెంట్లు వినిపించాయి.
అయితే ఆ కామెంట్లకు చెక్ పెట్టే క్రమంలో తాజాగా బీజేపీ కూడా తమ తొలివిడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతోందని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా తొలివిడతలో 40 మందని, 65 మందని, 75 మందని రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే... కరెక్ట్ ఫిగర్ పై ఇప్పటికీ క్లారిటీ లేనప్పటికీ... ఇవాళ రేపట్లో మాత్రం కొన్ని పేర్లు పక్కాగా విడుదల అవ్వబోతున్నాయని అంటున్నారు.
ఇందులో భాగంగా... తొలివిడతలో కీలకమైన వ్యక్తులతో పాటు అసంతృప్తులను బుజ్జగించే రీతిలో టిక్కెట్ల కేటాయింపు ఉండేలా జాగ్రత్తలు పడుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా... సీనియర్ నాయకురాలైన విజయశాంతితో పాటు విశ్వేశ్వర రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డికి టిక్కెట్ కన్ ఫాం చేస్తూ తొలి జాబితాలోనే ప్రకటించబోతున్నారని అంటున్నారు.
తొలివిడతలో బీజేపీ అభ్యర్థుల జాబితాపై ఒక అంచనా...!:
అంబర్ పేట - కిషన్ రెడ్డి
కరీంనగర్ – బండి సంజయ్
హుజూరాబాద్, గజ్వేల్ – ఈటల రాజేందర్
మెదక్ – విజయశాంతి
దుబ్బాక – రఘునందన్ రావు
గద్వాల – డీకే అరుణ
కోరుట్ల – ధర్మపురి అరవింద్
తాండూర్ – విశ్వేశ్వర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం - బూర నర్సయ్యగౌడ్/ దయానంద్ గౌడ్
నిర్మల్ – మహేశ్వర్‌రెడ్డి
మునుగోడు - రాజగోపాల్ రెడ్డి
సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి
మహబూబ్ నగర్ - జితేందర్ రెడ్డి
కల్వకుర్తి – ఆచారి
సికింద్రాబాద్ - బండ కార్తీక
ధర్మపురి (ఎస్సీ) – వివేక్ వెంకటస్వామి
బోధ్ (ఎస్టీ) - సోయం బాపూరావ్
ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్
చొప్పదండి (ఎస్సీ) – బొడిగె శోభ
మానకొండూరు (ఎస్సీ) - ఆరెపల్లి మోహన్
ఆందోల్ (ఎస్సీ) – బాబూమోహన్
ఇలా మొదలైన పేర్లతో ఉన్న జాబితాపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన అనంతరం గురువారం రాత్రి అమిత్ షాతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక శుక్రవారం మరోసారి జేపీ నడ్డాతో సభ్యులు భేటీ అయ్యి తుది జాబితాను సిద్ధం చేసి.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారని అంటున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, లక్ష్మణ్ పాల్గొంటారని తెలుస్తుంది. అనంతరం మీడియాకు విడుదల చేస్తారని సమాచారం.