6+5 = 11 పథకాలతో టీడీపీ-జనసేన మినీ మ్యానిఫెస్టో
ఈ విషయాన్ని ఇరు పార్టీల కీలక నేతలు.. యనమల రామకృష్ణుడు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్ వెల్లడించారు.
ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు పార్టీలు కూడా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. దీనిలో టీడీపీ ప్రతిపాదించిన 6 పథకాలు.. జనసేన సూచించిన 5 పథకాలను పేర్కొంటూ.. మొత్తంగా 11 కీలక పథకాలతో ఈ మేనిఫెస్టోను తాజాగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇరు పార్టీల కీలక నేతలు.. యనమల రామకృష్ణుడు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్ వెల్లడించారు.
ఇవీ 11 పథకాలు
1) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల(ఎంఎస్ ఎంఈ) ఏర్పాటుకు రూ. 10 లక్షల వరకూ రాయితీ
2) ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు
3) అమరావతే రాజధానిగా కొనసాగింపు
4) పేదలకు ఉచిత ఇసుక
5) కార్మిక సంక్షేమం
6) సౌభాగ్యపదం(యువత వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం)
7) యువతకు, మహిళలకు ఉపాధి కల్పన
8) మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
9) ఏటా 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
10) మహిళోదయం పేరుతో చదువుకునే అమ్మాయిలకు ప్రోత్సాహం
11) నియోజకవర్గానికో కళాశాల ఏర్పాటు